బీహార్‌లో ఆర్జేడీ 145, కాంగ్రెస్ 62 సీట్లలో పోటీ!

బీహార్‌లో ఆర్జేడీ 145, కాంగ్రెస్ 62 సీట్లలో పోటీ!
x
Highlights

బీహార్‌లో మహాఘడ్ బంధన్ గ్రాండ్ అలయన్స్‌ కూటమిలో సీట్ల పంపకాలు దాదాపుగా ఓ కొలిక్కివచ్చాయి. ఇప్పటివరకు, 150 కి పైగా సీట్లలో పోటీ చేస్తామని చెబుతూ..

బీహార్‌లో మహాఘడ్ బంధన్ గ్రాండ్ అలయన్స్‌ కూటమిలో సీట్ల పంపకాలు దాదాపుగా ఓ కొలిక్కివచ్చాయి. ఇప్పటివరకు, 150 కి పైగా సీట్లలో పోటీ చేస్తామని చెబుతూ వస్తున్న ఆర్జేడీ మిత్రపక్షాల అసంతృప్తి తరువాత మెత్తబడింది. వామపక్షాలు కూడా ఈ కూటమిలో భాగం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 2015 లో మూడు సీట్లు గెలుచుకున్న సిపిఐ (ఎంఎల్) కూడా కూటమిలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ముప్పై సీట్లకు సిపిఐ (ఎంఎల్) పార్టీ ఇప్పటికే తన అభ్యర్థులను ప్రకటించింది.

ఒప్పందం ప్రకారం మొత్తం 243 సీట్లలో ఆర్జేడీ 145 సీట్లలో అభ్యర్థులను నిలబెట్టనుంది. ఇప్పటివరకు కనీసం 70 సీట్లు కోరుతున్న కాంగ్రెస్ 62 స్థానాల్లో పోటీ చేయాలనీ నిర్ణయించుకుంది. అలాగే సిపిఐ, సిపిఐ (ఎం)లకు ఐదేసి సీట్లు, సిపిఐ (ఎంఎల్) కి 15 సీట్లు ఇచ్చే అవకాశం ఉంది. 2015 లో ఆర్జేడీ 100 సీట్లలో పోటీ చేయగా, కాంగ్రెస్ 43 సీట్లలో పోటీ చేసింది. ఇందులో ఆర్జేడీ 80, కాంగ్రెస్ 27 సీట్లు గెలుచుకున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories