Congress: ఐటీ నోటీసుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట

Big Relief For Congress Party Regarding IT Notices
x

Congress: ఐటీ నోటీసుల విషయంలో కాంగ్రెస్ పార్టీకి భారీ ఊరట

Highlights

Congress: ఐటీ నోటీసులపై బలవంతపు చర్యలు తీసుకోం

Congress: లోక్‌సభ ఎన్నికల ముందు వరుస ఐటీ నోటీసులతో సతమతమవుతన్న కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఊరట లభించింది. దాదాపు 3 వేల 500 కోట్ల పన్ను డిమాండ్ల నోటీసులకు సంబంధించి ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోబోమని ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు ఐటీ శాఖ తెలిపింది. పన్ను డిమాండ్ల నోటీసులను సవాల్‌ చేస్తూ కాంగ్రెస్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఐటీ విభాగం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. కాంగ్రెస్‌ రాజకీయ పార్టీ అని.. ప్రస్తుతం... దేశంలో ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నందున ఎలాంటి బలవంతపు చర్యలకు దిగబోమని కోర్టుకు తెలిపారు. దీనిపై తుది తీర్పు వచ్చేదాకా ముందస్తు చర్యలు చేపట్టమన్నారు. అనంతరం ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జులై 24వ తేదీకి వాయిదా వేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories