Navi Mumbai: నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ.. 100 కోట్లతో నిర్మాణం

Bhoomi Puja for TTD Venkateswara Temple in Navi Mumbai
x

Navi Mumbai: నవీ ముంబైలో శ్రీవారి ఆలయానికి భూమి పూజ.. 100 కోట్లతో నిర్మాణం

Highlights

Navi Mumbai: 600 కోట్ల విలువైన 10ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Navi Mumbai: నవీ ముంబైలోని ఉల్వే ప్రాంతంలో టీటీడీ అర్చకులు శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నవీ ముంబైలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషాన్ని కలిగించిందని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు. శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే, ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ లు దాదాపు 600 కోట్ల రూపాయలు విలువైన 10 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించడం జరిగిందన్నారు .అదే విధంగా శ్రీవారి ఆలయం నిర్మించేందుకు దాతగా రేమాండ్స్ కంపెనీ అధినేత గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారన్నారు. దాదాపు వందల కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడం జరుగుతుందన్నారు.

నవీముంభైలో శ్రీవారి ఆలయంను నిర్మించడం ద్వారా మహారాష్ట్ర భక్తుల కళ సహకారమైందన్నారు. వీలైనంత త్వరగా శ్రీవారి ఆలయంను నిర్మించి భక్తులకు అందుబాటులో తీసుకొస్తామని తెలిపారు. తిరుమలలో శ్రీవారి ఆలయం తరహాలోనే నవీముంబైలో సైతం నిర్మిస్తున్నామని టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి తెలియజేశారు. తిరుమల తరహాలో నవీ ముంబాయిలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించడానికి టీటీడీ ముందుకు రావడం అదృష్టంమని... ఆలయ నిర్మాణంతో నవీ ముంబాయి ఆర్దికంగా ముందుకు వెళ్తుందని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్‌ షిండే తెలియజేశారు. ఆలయానికి సమీపంలోని తీరప్రాంతం నుంచి నిర్మిస్తున్న అతి పెద్ద బ్రిడ్జితో కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి అనుసంధానం చేస్తామని, ఆలయ నిర్మాణానికి టీటీడీకి పూర్తిగా సహకరిస్తామని ఆయన తెలియజేశారు. తిరుమలకు వెళ్ళి స్వామి వారిని దర్శించుకోలేని భక్తులకు.. నవి ముంబాయిలో నిర్మిస్తున్న ఆలయంలో స్వామి వారిని దర్శించుకునే అదృష్టం లభిస్తుందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories