Rahul Gandhi: రెండో రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra Continues on the Second Day
x

Rahul Gandhi: రెండో రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

Highlights

Rahul Gandhi: రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర

Rahul Gandhi: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర రెండో రోజుకు చేరుకుంది. రెండో రోజు కన్యాకుమారి అగస్తీశ్వరం నుంచి పాదయాత్ర కొనసాగుతోంది. వివేకానంద పాలిటెక్నిక్ కాలేజీ నుంచి పాదయాత్ర ప్రారంభం అయింది. రాహుల్ గాంధీతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌తో పాటు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వెంట నడవనున్నారు. ఇవాళ మొత్తంగా 20 కిలోమీటర్లు నడవనున్నారు రాహుల్ గాంధీ. మధ్యాహ్నం 2 గంటలకు మహిళలతో భేటీ కానున్నారు. ఇక రాత్రి 7 గంటల వరకు పాదయాత్ర సాగనుంది. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 7 గంటల వరకు రెండు విడతలుగా రాహుల్ పాదయాత్ర చేయనున్నారు.

రాహుల్ భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో పాటు వేలాదిగా కార్యకర్తలు హాజరయ్యారు. రెండో రోజు పాదయాత్ర సమయంలో చిన్నారులతో మమేకం అయ్యారు. కన్యాకుమారి వీధుల్లో రాహుల్ గాంధీ పర్యటించారు. మరో రెండు రోజులు పాటు తమిళనాడులోనే రాహుల్ పాదయాత్ర సాగనుంది. సెప్టెంబర్ 11న కేరళ రాష్ట్రంలోని కలియిక్కవిలాలోకి భారత్ జోడో యాత్ర ప్రవేశించనుంది. కేరళలోని 12 లోక్‌సభ, 42 అసెంబ్లీ స్థానాల్లో... సెప్టెంబర్ 29 వరకు యాత్ర సాగనుంది. రాష్ట్రంలోని త్రిసూర్ ప్రాంతంలో ర్యాలీలో రాహుల్ గాంధీ ప్రసంగించనున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories