Corona Vaccine: వాగ్జిన్ మూడో దశ ట్రయల్స్‌పై భారత బయోటెక్ కీలక ప్రకటన

Bharat Bio-Tech Key Statement On 3rd Phase of Covaccine trails
x

Representational Image

Highlights

Corona Vaccine: కొవాగ్జిన్ 80.06శాతం సమర్థవంగా పని చేస్తోంది-భారత్ బయోటెక్

Corona Vaccine: మూడోదశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను భారత్ బయోటెక్ సంస్థ ప్రకటించింది. కొవాగ్జిన్ 80.06శాతం సమర్థవంగా పని చేస్తున్నట్లు తెలిపింది. 25,800 మందిపై కొవాగ్జిన్ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించగా, వారిపై టీకా సమర్థవంతంగా పని చేసిందని భారత్ బయోటెక్ సంస్థ పేర్కొంది. ఆ మేరకు సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే భారత్ బయోటెక్ సంస్థకు సంబంధించిన కొవాగ్జిన్ టీకాను దేశ ప్రజలందరికీ అందిస్తోంది.

రెండు దశల ట్రయల్స్‌కు సంబంధించి కొవాగ్జిన్ పనితీరు మెరుగ్గా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం.. భారత్ బయోటెక్ రూపొందించిన ఈ టీకాను అత్యవసర వినియోగం కింద వినియోగించవచ్చు అంటూ కేంద్ర వైద్యఆరోగ్యశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, అప్పటికి మూడో దశ ట్రయల్స్ ఫలితాలు ఇంకా వెల్లడి కాలేదు. దాంతో మూడో దశ ట్రయల్స్ ఫలితాలు రాకుండానే కేంద్ర ప్రభుత్వం ఈ టీకాకు అనుమతి ఇవ్వడం పట్ల దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. టీకా సమర్థతపై అనేక అనుమానాలు రేకెత్తించారు. ఫలితంగా కొవాగ్జిన్ టీకా సమర్థతపై అనుమానంతో చాలా మంది ఆ టీకాను వేసుకునేందుకు వెనుకడుగు వేశారు.

ఇక తాజాగా మూడో దశ ట్రయల్స్ ఫలితాలు కూడా విడుదలవడంతో భారత్ బయోటెక్ సంస్థకు సంపూర్ణంగా లైన్ క్లియర్ అయినట్లైంది. టీకా ప్రభావం కూడా ఘననీయంగా ఉండటంతో.. కొవాగ్జిన్ వినియోగం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories