Corona Virus: కొత్త రకాలు చాలా డేంజర్ - ఎయిమ్స్ డైరెక్టర్

Beware of new Strains Experts Warns
x

Representational Image

Highlights

Corona Virus: దేశంలో కొత్త రకాలు ఎక్కువ అవుతున్న నేసథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Corona Virus: దేశంలో కొత్త రకాలు ఎక్కువ అవుతున్న నేసథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ మంది గుంపులుగా తిరగడం మానుకోవాలని సూచిస్తున్నారు. సామూహికంగా ఉన్నప్పుడు కనీసం 80 శాతం మంది యాంటీ బాడీస్ ఉంటేనే మనం కొత్త రకాల బారిన పడకుండా ఉంటామని ఓ ఆంగ్ల పత్రికకకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా పేర్కొన్నారు. కొత్త రకాలు చాలా డేంజర్ అని.. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ..ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తులు తప్పనిసరిగా పాటించాలని కోరారు.

భారత్ లో వ్యాపిస్తున్న కొత్త కరోనా రకాలు అతి వేగంగా వ్యాపించే లక్షణాలు కలిగి ఉన్నాయని తెలిపారు. ఇదివరకే కరోనా వచ్చి నయమైన వారిలో, యాంటీబాడీస్ ఉన్న వారిలో కూడా మరలా ఆ వ్యాధి సోకేందుకు కొత్త రకాలు కారణం అవుతాయని వివరించారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 240 కరోనా రకాలు కనుగొన్నామని..మహారాష్ట్రలో గత వారం రోజులుగా కోవిడ్ కేసులు అంతకంతకు పెరిగేందుకు ఈ కొత్త రకాలే కారణమని డాక్టర్ శశాంక్ జోషి తెలిపారు. మహారాష్ట్రతో పాటు మధ్యప్రదేశ్, పంజాబ్, కేరళ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఈ సందర్భంగా వివరించారు. టీకా వేసుకున్నా..కోవిడ్ వచ్చి తగ్గినా సరే..మరలా వ్యాధి వచ్చేందుకు ఈ రకాలు కారణం కావొచ్చన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో తగిన జాగ్రత్తలు పాటించడమే ముఖ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా భారత్ లో కోవిడ్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, ఇసోలేషన్ వంటి ప్రక్రియలను మరోసారి మరింత వేగంగా చేపట్టాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories