Sandhya Mukhopadhyay: పద్మశ్రీ ఇచ్చి అవమానించారు

Bengali Singer Sandhya Mukhopadhyay Rejected Padma Shri | National News Today
x

పద్మశ్రీ ఇచ్చి అవమానించారు

Highlights

Sandhya Mukhopadhyay: పద్మశ్రీని తిరస్కరించిన బెంగాలీ గాయని

Sandhya Mukhopadhyay: కేంద్రం ప్రకటించిన పద్మ పురస్కారాన్ని తిరస్కరిస్తున్నట్టు ప్రముఖ బెంగాలీ గాయని.. 90 ఏళ్ల సంధ్యా ముఖోపాధ్యాయ ప్రకటించారు. జూనియర్‌ ఆర్టిస్టుకు ఇచ్చే పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి తనను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన స్థాయికి పద్మశ్రీ పురస్కారం తగదని సంధ్యా ముఖోపాధ్యాయ తెలిపారు.

పద్మశ్రీ పురస్కారాన్ని తీసుకునేది లేదని.. ఢిల్లీ నుంచి కాల్‌ చేసిన అధికారులకు తన తల్లి తెలిపినట్టు గాయని సంధ్యా ముఖోపాధ్యాయ కూతురు సౌమి సేన్‌గుప్తా తెలిపారు. పద్మ పురస్కారాన్ని తిరస్కరించడంలో ఎలాంటి రాజకీయం లేదని సౌమి చెప్పారు. ఇప్పటికే పద్మ భూషణ్‌ పురస్కారాన్ని బెంగాల్‌ మాజీ ముఖ్యమంత్రి బద్దదేవ‌ బట్టాచార్య తిరస్కరించారు. గతంలోనూ ఇలా పలువురు పద్మ అవార్డులను తిరస్కరించారు.

వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి ఏటా అత్యున్నత పౌర పురస్కారంతో కేంద్ర ప్రభుత్వం సన్మానిస్తుంది. ఈసారి నలుగురికి పద్మ విభూషణ్‌, 17 మందికి పద్మ భూషణ్‌, 107 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. కాంగ్రెస్‌ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌, బెంగాల్‌ నుంచి బుద్దదేవ్‌ భట్టాచార్యతో పాటు పలువురు ప్రముఖులకు పద్మభూషణ్ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories