Bengal Elections 2021: ఉద్రిక్తతల నడుమ బెంగాల్ రెండో దశ పోలింగ్

Bengal Second Phase Polling Amid Tensions
x

బెంగాల్ ఎన్నికలు (ఫైల్ ఇమేజ్)

Highlights

Bengal Elections 2021: డెబ్రా నియోజకవర్గంలో బీజేపీ, టీఎంసీ కార్యకర్తల ఆందోళనలు

Bengal Elections 2021: పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ ఉద్రిక్తతల నడుమ కొనసాగుతోంది. బెంగాల్ రెండో దశ పోలింగ్‌లో పలుచోట్ల ఘర్షణలు తలెత్తాయి. కేశ్‌పూర్‌లో బీజేపీ పోలింగ్ ఏజెంట్‌ఫై టీఎంసీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఏజెంట్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘర్షణలో స్థానిక బీజేపీ నేత కారును కూడా ధ్వంసం చేశారు టీఎంసీ కార్యకర్తలు.

ఇక డెబ్రా నియోజకవర్గంలో పోలింగ్ సరళిని పరిశీలిస్తోన్న బీజేపీ అభ్యర్థి భారతీఘోష్‌కు వ్యతిరేకంగా టీఎంసీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. భారతీ ఘోష్‌ ఓటర్లను ప్రబావితం చేస్తున్నారని ఆరోపించారు. మరోవైపు టీఎంసీ నేతలను పోలింగ్ బూత్ దగ్గరకు పంపి బీజేపీ వాళ్లని పంపడం లేదంటూ మండిపడ్డారు బీజేపీ నేతలు. దీంతో పోలింగ్ కేంద్రం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు ఘాటల్‌లో ఓటు వేసేందుకు వెళ్తోన్న తమను టీఎంసీ నేతలు అడ్డుకున్నారని సీపీఎం కార్యకర్తలు నిరసనలు తెలిపారు. టీఎంసీ నేతల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టైర్లు కాల్చి రోడ్డు బ్లాక్ చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories