Bengal: మమత క్యాబినెట్‌లో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చోటు సంపాదించారు.
Bengal: మమత క్యాబినెట్‌లో టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ చోటు సంపాదించారు. తివారీకి స్పోర్ట్స్ అండ్ యూత్ అఫైర్స్ శాఖను మమత కేటాయించారు. ఈ సందర్భంగా మనోజ్ తివారి ముఖ్యమంత్రి మమతకు కృతజ్ఞతలు తెలిపారు. 'మంత్రిగా ప్రమాణం చేయడం నాకు ఒక అద్భుతమైన అనుభూతిని కలిగించింది. ఈ అవకాశం ఇచ్చిన మమత దీదీకి, అభిషేక్ భయ్యాకు నా ధన్యవాదాలు. వారు నాపై నమ్మకం ఉంచి అప్పగించిన బాధ్యతల పట్ల సంతోషం' అంటూ మనోజ్ ట్వీట్ చేశారు. అతడు మంత్రిగా ప్రమాణం చేయడం పట్ల సహచర క్రికెటర్లు అభినందనలు తెలియజేశారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తన కేబినెట్ లో 43 మందిని మంత్రులుగా నియమించింది. సోమవారం వీరంతా రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సారి మంత్రి వర్గంలో 15 మంది కొత్త వాళ్లకు చోటు లభించగా.. వారిలో 35 ఏళ్ల మనోజ్ తివారి 12 అంతర్జాతీయ వన్డేలు, 3 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొన్నటి బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందే రాజకీయాల్లోకి వచ్చిన మనోజ్ తృణమూల్ కాంగ్రెస్‌లో చేరాడు.
మమత ఆయనకు పశ్చిమ బెంగాల్‌లోని హౌరా పరిధి శిబ్‌పూర్ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. మనోజ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రథిన్ చక్రబొర్తిపై గెలుపొంది అసెంబ్లీలో అడుగుపెట్టాడు. రాష్ట్రంలో ప్రబలుతున్న కరోనా వైరస్ నుంచి గెలుపొందడమే అసలైన గెలుపు.' అని మనోజ్ అన్నాడు. తాను గెలవడానికి సహకరించిన శిబ్‌పూర్ ప్రజలకు రుణపడి ఉంటానని చెప్పాడు. కోవిడ్ క్లిష్ట సమయంలో తాను అందరికీ సహాయం చేయడానికి ముందుంటానని చెప్పుకొచ్చాడు.
This swearing-in ceremony has been an unprecedented experience for me. I would like to thank our favourite DIDI @MamataOfficial & my brother @abhishekaitc for having faith on me and giving this opportunity to serve the people of Bengal.
— MANOJ TIWARY (@tiwarymanoj) May 10, 2021
A new journey begins!#AITC #JoyBangla pic.twitter.com/WvbkfVrsSr
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire