Kolkata Doctor Rape And Murder Case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై భగ్గుమంటున్న బెంగాల్

Bengal is reeling over the murder of a junior doctor
x

Kolkata Doctor Rape And Murder Case: జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై భగ్గుమంటున్న బెంగాల్

Highlights

Kolkata Doctor Rape And Murder Case: బాధితురాలకి న్యాయం కోసం గత మూడు వారాల నుంచి నిరసనలు

Kolkata Doctor Rape And Murder Case: ఆర్జీకర్ హాస్పిటల్‌లో జూనియర్ డాక్టర్‌ హత్యాచార ఘటనపై బెంగాల్‌ భగ్గుమంటోంది. ధర్నాలు, ఆందోళనలతో అట్టుడుకుతోంది. బాధితురాలకి న్యాయం కోసం గత రెండు, మూడు వారాల నుంచి నిరసనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. డాక్టర్లకు మద్దతుగా అన్ని వర్గాల వారు రోడ్లపైకి వచ్చి నిరసన తెలియజేస్తున్నారు. రోడ్లపై ధర్నాలు, పోలీసుల అడ్డగింతలు, లాఠీఛార్జ్‌లు, అరెస్టులతో ప్రతిరోజూ రాష్ట్రవ్యాప్తంగా హైటెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఇటు ప్రతిపక్ష బీజేపీ సైతం.. మమతా సర్కార్‌పై నిప్పులు చెరుగుతోంది. దీనికి బాధ్యత వహిస్తూ మమత దిగిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. శుక్రవారం వర్షాన్ని సైతం లెక్క చేయకుండా బీజేపీ మహిళా కార్యకర్తలు మహిళా కమిషన్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు.

ఇదిలా ఉంటే.. బుధవారం 12 గంటల పాటు పశ్చిమబెంగాల్‌ బంద్‌కు బీజేపీ ఇచ్చిన పిలుపు పలుచోట్ల ఉద్రిక్తతలకు దారితీసింది. దీనిపై మమత స్పందిస్తూ.. బెంగాల్‌లో అశాంతి చెలరేగితే అస్సాం, ఈశాన్యం, ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, డీల్లీలపైనా దాని ప్రతికూల ప్రభావం ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. వారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి పాస్‌పోర్ట్‌, వీసా కూడా లభించదని వ్యాఖ్యానించారు. నిరసనలకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ వ్యాఖ్యలను బాధితురాలి తల్లి ఖండించారు. కన్నబిడ్డను కోల్పోయిన బాధలో ఉన్న మమ్మల్ని మమత చేసిన వ్యాఖ్యలు మరింత బాధించాయన్నారు. ఆమెకు పిల్లలు లేరు. అందుకే వారిని కోల్పోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలియదన్నారు అభయ తల్లి.

Show Full Article
Print Article
Next Story
More Stories