కొత్త అవతారంలో భారత్ లోకి ప్రవేశిస్తున్న చైనా నిషేధిత యాప్స్?

కొత్త అవతారంలో భారత్ లోకి ప్రవేశిస్తున్న చైనా నిషేధిత యాప్స్?
x
Highlights

కొన్ని రోజుల క్రితం, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ యాప్స్ కొత్త మార్గాల్లో భారతీయ వినియోగదారులను..

కొన్ని రోజుల క్రితం, భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని చైనా యాప్‌లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ యాప్స్ కొత్త మార్గాల్లో భారతీయ వినియోగదారులను చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. యాప్ స్టోర్‌లో చైనీస్ యాప్‌ల సంఖ్య కూడా గత కొన్ని నెలలుగా పెరుగుతోంది. నివేదికల ప్రకారం, ఈ అప్లికేషన్లు రీబ్రాండెడ్ వెర్షన్లను కూడా కలిగి ఉన్నాయి. కాగా జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టిక్‌టాక్‌ తో సహా 59 యాప్‌లను కేంద్ర ప్రభుత్వం మొదట్లో నిషేధించింది. దీని తరువాత జూలైలో మరో 47, సెప్టెంబర్‌ లో 118 యాప్‌లను నిషేధించారు.

అయితే కొన్ని యాప్ లు భారత్ లో పేరు మార్చుకొని మళ్ళీ వస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. ఉదాహరణకు స్నాక్ వీడియో యాప్ అనేది 'టెన్సెంట్' ఇంటర్నెట్ కంపెనీ నుంచి వచ్చిన యాప్.. దీనిని కుయిషౌ సంస్థ అభివృద్ధి చేసింది. ఈ యాప్ సరిగ్గా క్వాయ్ వలె కనిపిస్తుంది. క్వాయ్ యాప్‌ను కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. కాగా స్నాక్ వీడియో గూగుల్ ప్లే స్టోర్‌లో 100 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లు పొందింది. ఇది మాత్రమే కాదు, టిక్‌టాక్ అషన్స్ ఉండే యాప్ కూడా ప్లే స్టోర్ లో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇలా నిషేధించిన యాప్ లు పేరు మార్చుకొని భారత్ లోకి ప్రవేశిస్తున్నాయని టెకీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వీటిపై నిఘా పెట్టాలని.. లేదంటే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories