Babul Supriyo: రాజకీయాలకు బాబుల్ సుప్రియో గుడ్ బై

Babul Supriyo Quits Politics
x

Babul Supriyo: రాజకీయాలకు బాబుల్ సుప్రియో గుడ్ బై

Highlights

Babul Supriyo: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ , కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు.

Babul Supriyo: పశ్చిమ బెంగాల్ బీజేపీ ఎంపీ , కేంద్ర మాజీమంత్రి బాబుల్ సుప్రియో రాజకీయాలకు గుడ్ బై కొట్టేశారు. కేబినెట్ విస్తరణలో పదవి ఊడటంతో ఆయన తీవ్ర నిరాశలో ఉన్నారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని సమాజ సేవ చేయడానికి రాజకీయాలే అక్కరలేదంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. తాను ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నానని త్వరలోనే ప్రభుత్వ బంగ్లాను కూడా ఖాళీ చేస్తాననీ తెలిపారు. 2014లో బీజేపీలో చేరి అసాన్ సోల్ ఎంపీగా గెలిచిన బాబుల్ ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గంలో సహాయ మంత్రి హోదాలో పనిచేశారు. తాజా కేబినెట్ విస్తరణలో ఆయనను తప్పించిన దగ్గర్నుంచి అసహనంతో ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories