Babri Verdict : బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు.. అందరూ నిర్దోషులే..

Babri Verdict : బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో సంచలన తీర్పు.. అందరూ నిర్దోషులే..
x
Highlights

బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో అందరూ నిర్దోషులే అని ప్రత్యేక సిబిఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో ఎలాంటి కుట్రకోణం లేదని.. పధకం ప్రకారమే మసీదును కూల్చివేశారన్నదానికి..

బాబ్రీ మసీద్ కూల్చివేత కేసులో నిందితులు అందరూ నిర్దోషులే అని ప్రత్యేక సిబిఐ కోర్టు తేల్చింది. కూల్చివేతలో ఎలాంటి కుట్రకోణం లేదని.. పధకం ప్రకారమే మసీదును కూల్చివేశారన్నదానికి ఆధారాలు లేవలేని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు చెప్పింది. దీంతో బీజేపీ అగ్రనేతలు లాల్ కృష్ణ అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతిలకు ఊరట లభించింది. కాగా ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్న వినయ్‌ కతియార్, సాక్షిమహారాజ్‌, ధరమ్‌దాస్‌, రామ్‌ విలాస్‌ వేదాంతి, లల్లూ సింగ్, పవన్ పాండ్యా తదితరులు కోర్టుకు చేరుకున్నారు. ఇక మాజీ ఉపప్రధాని ఎల్‌కే అడ్వాణీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్‌ జోషి, కళ్యాణ్‌‌ సింగ్‌, సతీశ్‌ ప్రధాన్‌, గోపాల్‌ దాస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కోర్టు ఎదుట హాజరయ్యారు.

ఈ కేసుతో సంబంధమున్న 32 మంది నిందితులలో ఎల్.కె.అద్వానీ, మురళి మనోహర్ జోషి, ఉమా భారతి , కళ్యాణ్ సింగ్ - నేరపూరిత కుట్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే తాజాగా వీరంతా నిర్దోషులే అని కోర్టు తీర్పు చెప్పడంతో 28 ఏళ్ల సుదీర్ఘ విచారణకు తెరపడినట్లయింది. 1992 డిసెంబర్‌ 6న కరసేవకులు అయోధ్యలో బాబ్రీ మసీదుని కూల్చివేసిన విషయం విదితమే. ఈ కేసును విచారించిన సీబీఐ 351 మంది సాక్షుల్ని న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టింది. 600 డాక్యుమెంట్లను రుజువులుగా చూపించింది. 48 మందిపై అభియోగాలు నమోదు చేయగా, విచారణ జరుగుతుండగానే 16 మంది ప్రాణాలు కోల్పోయారు.

Show Full Article
Print Article
Next Story
More Stories