Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలో నీటి లీకేజీకి కారణం అదే.. స్పష్టతనిచ్చిన నిర్మాణ కమిటీ చైర్మన్‌

Ayodhya Ram Mandir Official Says No Roof Leak Water Came From Pipes For Wires
x

Ayodhya Ram Mandir: అయోధ్య గర్భగుడిలో నీటి లీకేజీకి కారణం అదే.. స్పష్టతనిచ్చిన నిర్మాణ కమిటీ చైర్మన్‌ 

Highlights

Ayodhya Ram Mandir: రెండో అంతస్తు పూర్తి అయితే లీకేజీ కాదన్న మిశ్రా

Ayodhya Ram Mandir: అయోధ్యలోని రామమందిరం ప్రధాన గర్భాలయంలో నీరు లీకవడంపై ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా స్పందించారు. విద్యుత్ తీగల కోసం అమర్చిన పైపుల ద్వారా నీరు కిందకు వచ్చిందని వివరించారు. ఆలయంలో నీటి లీకేజీ లేదని... రెండో అంతస్తు నిర్మాణంలో ఉందన్నారు. రెండో అంతస్తు పూర్తి అయితే వర్షం నీరు ఆలయంలోకి రావడం ఆగిపోతుందన్నారు. సోమవారం అర్ధరాత్రి పడిన వర్షానికి రామ్‌లల్లా విగ్రహం ముందు పూజారి కూర్చునే స్థలం, వీఐపీ దర్శనం కోసం భక్తులు వచ్చే ప్రదేశం వరకూ నీరు వచ్చాయని ఆలయ ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర దాస్ ఆరోపించగా... ఆ మేరకు ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ వివరణ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories