Ayodhya: శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య సిద్ధం

Ayodhya Is Ready For Sri Rama Navami Celebrations
x

Ayodhya: శ్రీరామనవమి వేడుకలకు అయోధ్య సిద్ధం

Highlights

Ayodhya: ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు వేడుకలు

Ayodhya: శ్రీరామనవమి వేడుకల సందర్భంగా రామజన్మభూమి అయోధ్యనగరి సర్వాంగా సుందరంగా ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా ఇవాళ్టి నుంచి మూడు రోజుల పాటు ఆయోద్య రామ మందిరాన్ని 20 గంటల పాటు భక్తుల కోసం తెరచి ఉంచాలని నిర్ణయించారు. బాలరాముడి ప్రాణ ప్రతిష్ట అనంతరం తొలి శ్రీరామనవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు 40 లక్షల మంది వేడుకలకు హజరవుతారని అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు ఏడు వరుసల్లో భక్తులను దర్శనానికి అనుమంతించాలని నిర్ణయించింది.

శ్రీరామనవమి వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. నయా ఘాట్ జోన్, నాగేశ్వర నాథ్ జోన్, హనుమాన్ గర్హి టెంపుల్ జోన్, కనక్ భవన్ టెంపుల్ జోన్ సహా ఇతర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులక సౌకర్యార్ధం 24 గంటల పాటు పని చేసే విధంగా కంట్రోల్ రూం ను ఏర్పాటు చేశారు. మూడు షిఫ్టుల్లో అధికారులను నియమించనున్నారు. రామజన్మభూమి మార్గంలో అదనంగా 80 సీసీ కెమెరాలు,. 50 చోట్ల వాటర్ కూలర్లను సైతం ఏర్పాటు చేస్తున్నారు.

రామ్ లల్లా దర్బారులో వీఐపీల దర్శనాలను రద్దు చేశారు. నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శానికి ఎలాంటి ఏర్పాట్లు ఉండవని శ్రీరామ మందిర్ ఆలయ ట్రస్టు మార్గదర్శకాలను జారీ చేసింది. ఈనెల 18వరకు జారీ చేసిన వీఐపీ పాసులను రద్దు చేశారు. భక్తుల రద్దీ నేపధ్యంలో వీఐపీ దర్శనాలకు బ్రేక్ వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories