Ayodhya: సందడిగా మారిన అయోధ్య నగరం

Ayodhya Getting Ready For Prana Pratishtha
x

Ayodhya: సందడిగా మారిన అయోధ్య నగరం

Highlights

Ayodhya: చార్టర్డ్ విమానాల కోసం 12 చోట్ల హెలిప్యాడ్‌లు

Ayodhya: అయోధ్య నగరం సందడిగా మారింది. యావత్‌ ప్రపంచం వ్యాప్తంగా ఉన్న హిందువులు ..అయోధ్యలో బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టా కోసం ఎదురు చూస్తుంది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. స్థానికులు పూల దండలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరిస్తున్నారు. విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి వీఐపీలు హాజరుకానున్నారు. అయోధ్య నగరంలో డ్రోన్లు, భద్రత బలగాలతో అధికారులు నిఘా పెంచారు. ఇప్పటికే రామ్‌లల్లా విగ్రహం గర్భగుడికి చేరుకుంది. ఇప్పటికే అయోధ్య ప్రారంభోత్సవానికి తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని భక్తులకు అందించనున్నారు. 25 గ్రాముల బరువుతో లక్ష లడ్డూలను తయారు చేస్తున్నారు.

అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ట కోసం ఏర్పాట్లు చురుగ్గా కొనసాగుతున్నాయి. పూజరులు నిర్వహిస్తున్న ప్రత్యేక క్రతువులు మూడో రోజుకు చేరాయి. రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు అనిల్‌ మిశ్రా దంపతులు సరయూ నది తీరంలో కలశ పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కలశాలను సరయూ నదీ జలాలలో నింపి పూజలు చేశారు.

రామ్‌లల్లా ప్రతిష్టాపన సందర్భంగా ప్రధాన ఆలయ ప్రాంగణంలోకి ఈ కలశాలను తీసుకెళ్తారు. ప్రతిష్టాపన కంటే ముందు ఈ జలాలతో పూజలు చేస్తారు. మొత్తం 121 మంది ఆచార్యులు క్రతువుల్లో పాల్గొంటున్నారు. లక్ష్మీకాంత్‌ దీక్షిత్‌ ప్రధాన ఆచార్యుడిగా వ్యవహరిస్తున్నారు.గణేశ్‌ అంబికా పూజ, వరుణ పూజ, మాత్రికా పూజ, వాస్తు పూజ జరుతుండగా.. ఈనెల 21 వరకు ఈ క్రతువులు కొనసాగుతాయి.

భవ్య మందిరంలో ప్రతిష్టించబోయే రామ్‌లల్లా విగ్రహం అయోధ్యకు చేరుకుంది. భక్తుల జయజయ ధ్వానాల మధ్య వాహనంలో ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. గర్భాలయంలోని వేదికపైకి చేర్చారు. కళ్లకు గంతలు కట్టి ఉన్న ఈ విగ్రహం చిత్రాలను తీర్థ క్షేత్ర ట్రస్టు విడుదల చేయలేదు. ఈ నెల 22న ఇదే విగ్రహానికి ప్రాణప్రతిష్ట చేయబోతున్నారు. ప్రాణప్రతిష్ట తర్వాతే రామ్‌లల్లా చిత్రాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు, రామ్‌లల్లా ప్రతీకాత్మక విగ్రహం ఆలయ ప్రాంగణానికి చేరుకుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories