Atishi as Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా నేడు అతిషీ ప్రమాణ స్వీకారం..మరో ఐదుగురు మంత్రులు కూడా

Atishi will take oath as Chief Minister of Delhi today
x

 Atishi as Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా నేడు అతిషీ ప్రమాణ స్వీకారం..మరో ఐదుగురు మంత్రులు కూడా

Highlights

Atishi as Delhi CM: నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు కేజ్రీవాల్.

Atishi as Delhi CM: నేడు ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఎలాంటి అవినీతి ఆరోపణలు లేని నేతను ముఖ్యమంత్రిగా చేస్తున్నారు కేజ్రీవాల్. ఈ నిర్ణయం ఢిల్లీ ప్రజలకు కూడా ఎంతో మేలు చేస్తుందని చెప్పవచ్చు. దీంతో తన పార్టీలో కుటుంబ పాలన ఉండదని ప్రూవ్ చేశారు కేజ్రీవాల్.

లిక్కర్ స్కాము కేసులో ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తప్పు చేశారో లేదో అన్న విషయాన్ని పక్కన పెట్టినట్లయితే ఆప్ నేత అతిషీని సీఎం పీఠంపై కూర్చోబెడుతుండటం గొప్పవిషయంగా చెప్పవచ్చు. మన దేవంలో చాలా పార్టీలు, కుటుంబ పార్టీలే ఉన్నాయి. తమ తర్వాత తమ కుటుంబీకులే ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచనతో చాలా మంది నేతల ఉన్నారు. కానీ కేజ్రీవాల్ దీనికి భిన్నమని నిరూపించారు. తాను వైదొలిగిన తర్వాత తన భార్య కాకుండా..పార్టీలో మంచి పేరున్న నేతను సీఎంగా ప్రకటించడం దీనికి నిదర్శనం. నేడు మధ్యాహ్నం 4.30గంటలకు రాజ్ నివాస్ లో అతిషీ...ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆమెతోపాటు మరో ఐదుగురు ఆప్ మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఢిల్లీ అనేది పూర్తి స్థాయి రాష్ట్రం కాకపోవడంతో..అతిషీని ముఖ్యమంత్రిగా రాష్ట్రపతి ద్రౌపది నియమించారు. ఈ విషయాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈమధ్యే కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అతిషీ ముఖ్యమంత్రి అవుతున్నారు. అయితే ఈ కార్యక్రమం సాదాసీదాగా సాగిపోనుంది. ఎందుకంటే ఆమె ముఖ్యమంత్రి అవ్వడం కంటే ప్రస్తుతం పార్టీలో పరిస్థితులు బాగలేకపోవడం ప్రధాన అంశంగా చెప్పవచ్చు. కేజ్రీవాల్ రాజీనామా చేయడం ఆప్ నేతలకు నచ్చలేదు. మన సమయం బాలేదు అనుకుంటూ సర్ధుకుపోతున్నారు.

నిజానికి కేజ్రీవాల్ పెద్ద స్కెచ్ వేసుకోనే రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సుప్రీంకోర్టు బెయిన్ ఇచ్చింది. చాలా కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్ వల్ల ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా, నిర్ణయాలు తీసుకోలేని పరిస్ధితి ఉంది. ఆ మాత్రం దానికి ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఉపయోగం ఏం ఉంటుందని భావించిన కేజ్రీవాల్ వెంటనే రాజీనామా చేశారు. దీని వల్ల ఆయనపై ప్రజల్లో జాలీ వస్తోంది. ప్రజలే అంతిమ న్యాయ నిర్ణేతలు అంటూ తనను మళ్లీ గెలిపించేందీ లేనిదీ ప్రజల చేతిలో పెట్టడం ద్వారా కేజ్రీవాల్ పొలిటికల్ గేమ్ ప్లాన్ షురూ అయ్యింది.


Show Full Article
Print Article
Next Story
More Stories