Hathras Stampede: ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్ లో తొక్కిసలాట: 80మందికి పైగా మృతి

Hathras Stampede: ఉత్తర్ ప్రదేశ్ హాథ్రస్ లో తొక్కిసలాట: 80మందికి పైగా మృతి
x
Highlights

Hathras Stampede News: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ లో మంగళవారం నాడు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

Hathras Stampede: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాథ్రస్ లో మంగళవారం నాడు ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇందులో 80 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ ఘటనలో గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

ఈ ఘటనపై విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టుగా జిల్లా మేజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ తెలిపారు. ఇప్పటివరకు 27 మృతదేహలను ఈటల ఆసుపత్రికి తరలించామని జిల్లా ఎస్పీ రాజేష్ కుమార్ సింగ్ చెప్పారు.

హాథ్రస్ మృతులకు రాష్ట్రపతి సంతాపం

హాథ్రాస్ మృతులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.



హాథ్రస్ ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

హాథ్రస్ ఘటనపై ప్రధానమంత్రి మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. లోక్ సభలో ఈ విషయమై ఆయన స్పందించారు. మృతులకు కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.



మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియా

హత్రాస్ లోని ఫుల్రాయి గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట జరిగింది. ఇది ప్రైవేటు కార్యక్రమం కావడంతో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అనుమతి ఇచ్చారు. భద్రతా ఏర్పాట్లను అధికార యంత్రాంగం చేసింది.కానీ ఇతర ఏర్పాట్లను నిర్వాహకులు చేయాలని జిల్లా మేజిస్ట్రేట్ తెలిపారు. భోలే బాబా అలియాస్ నారాయణ్ సాకర్ హరి గౌరవార్ధం ఆధ్యాత్మిక కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాబా వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో మరణించిన కుటుంబాలకు రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ. 50 వేలను నిర్వాహకులు ప్రకటించారు.

ఘటన స్థలానికి మంత్రులను పంపిన యూపీ సీఎం యోగి

ప్రమాదం జరిగిన గ్రామానికి ఇద్దరు మంత్రులను పంపారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. లక్ష్మీ నారాయణ్ చౌదరి, సందీప్ సింగ్ లను పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీలను కూడ సంఘటన స్థలానికి వెళ్లాలని సీఎం ఆదేశించారు. యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

ప్రత్యక్ష సాక్షి ఏఎన్ఐ వార్తా సంస్థకు ఈ దుర్ఘటన గురించి ఏమన్నారంటే..


Show Full Article
Print Article
Next Story
More Stories