Jammu Kashmir Polls: జమ్మూకాశ్మీర్‌లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ

Assembly election process concluded in Jammu and Kashmir
x

Jammu Kashmir Polls: జమ్మూకాశ్మీర్‌లో ముగిసిన అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ

Highlights

Jammu Kashmir Polls: ఇవాళ చివరిదైన థర్డ్ ఫేజ్ ఎలక్షన్స్ పూర్తి

Jammu Kashmir Polls: జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. మొత్తం మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణ చేపట్టగా.. ఇవాళ చివరిదైన థర్డ్ ఫేస్ ఎలక్షన్స్ జరిగాయి. జమ్ము ప్రాంతంలో 24, కశ్మీర్‌ లోయలో 16 కలిపి మొత్తం 40 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం కనబరిచారు. సాయంత్రం 5 గంటల వరకు 65.48శాతం ఓటింగ్ నమోదు అయిందైంది.

క్యూ లైన్లో ఉన్న వారు కూడా ఓటు హక్కు వినియోగించుకుంటే.. ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉంది. మూడో విడతలో మొత్తం 415 మంది అభ్యర్థుల తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.గా.. 39 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 5,060 పోలింగ్‌ కేంద్రాల్లో దాదాపు 20 వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొన్నారు. మొదటి దశలో 61.38 శాతం పోలింగ్‌ నమోదుకాగా, సెప్టెంబర్‌ 26 న జరిగిన రెండో దశలో 57.31 శాతం పోలింగ్‌ నమోదయ్యింది. ఎన్నికల ఫలితాలను అక్టోబరు 8న వెల్లడి కానుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories