Owaisi Warns PM Modi: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశ ప్రధాని నరేంద్ర మోడిపై మండిపడ్డారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం కోసం...
Owaisi Warns PM Modi: ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ దేశ ప్రధాని నరేంద్ర మోడిపై మండిపడ్డారు. ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణం కోసం నిర్వహించే భూమి పూజ కార్యక్రమానికి ప్రధాని హాజరయ్యే అవకాశాలు ఉండడంతో ఆయన ప్రధాని మోడిపై ట్విటర్ అకౌంట్ ద్వారా సంచలన వ్యాఖ్యలు చేసారు.
" దేశ ప్రధానిగా అధికారిక హోదాలో రామ మందిర నిర్మాణ భూమి పూజకు హాజరుకావడం రాజ్యాంగంలోని లౌకిక వాదాన్ని ఉల్లంఘించడ కిందికి వస్తుందని, 400 సంవత్సరాలకు పైగా బాబ్రీమసీదు అయోధ్యలో ఉండేది. దీన్ని 1992 లో కరసేవకులు దీన్ని కూల్చివేయడాన్ని మేము ఇంకా మరచిపోలేదని ఆయన ట్వీట్ చేసారు.
అయోధ్యలోని మసీదు పురాతన రామాలయం ఉన్న స్థలంలో నిర్మించబడిందని పేర్కొన్న "కర సేవకులు" 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదును కూల్చివేసారన్నారు. ఒకప్పుడు బాబ్రీ మసీదు నిర్మించి ఉన్న వివాదాస్పద స్థలంలో రామ్ ఆలయం నిర్మాణానికి అనుకూలంగా గత ఏడాది నవంబర్‌లో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. ఆగస్టు 5 న రామ్ మందిర్ నిర్మాణానికి ట్రస్ట్ సభ్యులు భూమి పూజను నిర్వహించనుందన్నారు. ఆగస్టు 5 న నిర్వహించే ఈ కార్యక్రమానికి హాజరుకావాలన్న నిర్ణయాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ వెల్లడి చేయనప్పటికీ ఆహ్వానితుల్లో ఆయన కూడా ఉండడం విశేషం. ఆయనతో పాటు ఈ భూమి పూజ కార్యక్రమానికి రామ్ జన్మభూమి ఉద్యమ నాయకుడు ఎల్కె అద్వానీని కూడా ఆహ్వానిస్తామని రామ్ మందిర్ ట్రస్ట్ సభ్యుడు తెలిపారు. ఆహ్వానితుల జాబితాలో హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉదవ్ ఠాక్రే, బీహార్ సిఎం నితీష్ కుమార్ కూడా ఉన్నారు.
Attending Bhumi Pujan in official capacity will be a violation of @PMOIndia's constitutional oath. Secularism is part of the Basic Structure of Constitution
— Asaduddin Owaisi (@asadowaisi) July 28, 2020
We can't forget that for over 400 years Babri stood in Ayodhya & it was demolished by a criminal mob in 1992 https://t.co/qt2RCvJOK1
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire