Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఎవరని జోరుగా చర్చ

Arpita Mukherjee is a Hot Topic on SSC Recruitment Scam
x

Arpita Mukherjee: అర్పితా ముఖర్జీ ఎవరని జోరుగా చర్చ

Highlights

*బెంగాల్ ఉపాధ్యాయ నియామక కుంభకోణంతో...అర్పితా ముఖర్జీ పేరు వెలుగులోకి...

Arpita Mukherjee: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ పశ్చిమ బెంగాల్‌లో నిర్వహించిన దాడుల్లో 21 కోట్ల రూపాయల కట్టల గుట్టలు లభించడంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బెంగాల్‌ ఉపాధ్యాయ నియామక కుంభకోణంపై విచారణ చేపట్టిన ఈడీ సినీనటి, మోడీల్ అర్పితా ముఖర్జీ ఇంట్లోనూ దాడులు చేశారు. దీంతో కళ్లు చెదరిలా ఏకంగా 21 కోట్ల రూపాయల నగదు లభ్యమైంది. ఈ కేసులో బెంగాల్‌ మంత్రి పార్థా ఛటర్జీతో పాటు ఆయన వ్యక్తిగత కార్యదర్శి సుకాంతా ఆచార్య, పార్థ చటర్జీ సన్నిహితురాలు అర్పితా దీంతో అర్పితా ముఖర్జీని అరెస్టు చేసినట్టు ఈడీ వెల్లడించింది. దీంతో అర్పిత ముఖర్జీ వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి. దీంతో అర్పిత ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది.

అర్పితా ముఖర్జీ బెంగాలీ, ఒరియా, తమిళ చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించారు. బెంగాలీలో ఒకటి రెండు పెద్ద చిత్రాల్లోనూ ఆమె కనిపించారు. ఆమె ఫేస్‌బుక్‌ బయోలో మల్టీ టాలెంటెడ్‌ అని ఉంది. పార్థా ఛటర్జీ నిర్వహించే దుర్గా పూజల కమిటీ 'నాట్కల ఉదయన్‌ సంఘ'కు ఆమె ప్రచారకర్తగానూ వ్యవహరించారు. ఛటర్జీకి చెందిన, కోల్‌కతాలోనే పెద్దదైన దుర్గ పూజా కమిటీలో 2019, 2020లో ఆమె చురుగ్గా వ్యవహరించారు. ఆ సమయంలో అర్పితకు ఛటర్జీతో పరిచయం ఏర్పడింది. ఈడీ తనిఖీల విషయం తెలిసిన వెంటనే దుర్గామాత పూజలో ఆమె, పార్థా ఛటర్జీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలిసి పాల్గొన్న పాత చిత్రాన్ని భాజపా నేత సువేందు అధికారి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు. పార్థా చటర్జీ అరెస్టు కంటే ముందే అర్పితనూ ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

అయితే ఆమె తన వద్ద 21 కోట్ల రూపాయల నగదు ఎందుకు ఉందో సరైన వివరణ ఇవ్వలేదని ఈడీ తెలిపింది. ఉపాధ్యాయ నియామక కుంభకోణంతో ప్రమేయం ఉండవచ్చన్న అనుమానం వ్యక్తం చేసింది. అంతకుముందు అర్పితా ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ తన నివాసంలో నగదు పట్టుబడటం భాజపా కుట్రగా ఆరోపించారు. అయితే పశ్చిమ బెంగాల్‌ నేత సువేందు అధికారి మాత్రం ఇది కేవలం ట్రైలర్ మాత్రమేనని ముందు అసలు సినిమా బయటకు రానున్నదని తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories