Indian Army: మారిన భారత సైనిక వ్యూహం.. ఒట్టిచేత్తో శత్రువును మట్టి కరిపించేలా కఠోర శిక్షణ

Army Soldiers Undergo Intense Training
x

Indian Army: మారిన భారత సైనిక వ్యూహం.. ఒట్టిచేత్తో శత్రువును మట్టి కరిపించేలా కఠోర శిక్షణ

Highlights

Indian Army: చంపు లేదా చావు... చైనా సరిహద్దు వద్ద 15వేల అడుగుల ఎత్తులో ఉన్న అస్సాం హిల్ మీద ఏర్పాటు చేసుకున్న బంకర్‌పై భారత సైనికులు ఈ నినాదం రాసుకున్నారు.

Indian Army: చంపు లేదా చావు... చైనా సరిహద్దు వద్ద 15వేల అడుగుల ఎత్తులో ఉన్న అస్సాం హిల్ మీద ఏర్పాటు చేసుకున్న బంకర్‌పై భారత సైనికులు ఈ నినాదం రాసుకున్నారు. ఒక్క తూటా కూడా పేలకుండానే నిమిషాల వ్యవధిలో ఇరువైపులా దాదాపు 60 మంది సైనికుల ప్రాణాలు తీసిన గల్వాన్‌ ఘటన వాస్తవాధీన రేఖ వద్ద అనుసరిస్తున్న మన సైనిక వ్యూహ స్వరూపాన్ని మార్చేసింది. ఆయుధాలు వాడకూడదన్న ఒప్పందాన్ని గౌరవిస్తున్నట్లు నటిస్తున్న చైనా కర్రలు, ఇనుపరాడ్‌లతో విధ్వంసానికి పాల్పడుతోంది. ఈ నేపథ్యంలో భారత సైన్యం తన బలగాల శిక్షణ పంథాను మార్చింది.

గల్వాన్‌ ఘటనకు ముందు వరకూ భారత సైన్యం వాస్తవాధీన రేఖ వెంబడి గస్తీ మాత్రమే నిర్వహించేది. 2017లో జరిగిన డోక్లాం ఘటనలో ఇరు దేశాల సైనికులు దాదాపు 72 రోజులపాటు ఎదురెదురుగా నిలబడ్డారు తప్ప దాడులకు దిగలేదు. తూటా పేల్చకూడదన్న ఒప్పందాన్ని గౌరవిస్తూనే ఒట్టిచేతులతో ప్రత్యర్థిని మట్టికరిపించే వ్యూహాలకు పదునుపెట్టాల్సిన అవసరాన్ని చాటిచెప్పింది. ఈ నేపథ్యంలో భారత సైన్యం ప్లాన్‌-190కి రూపకల్పన చేసింది. చైనా సరిహద్దుల్లో విధులు నిర్వహించే ప్రతి సైనికుడు వాతావరణ మార్పులతో సంబంధం లేకుండా 24 గంటలకు ఒకసారి 190 నిమిషాల పాటు కఠోర శిక్షణ తీసుకోవాలి. ఇందులో భాగంగా పుషప్స్‌, సిటప్‌, స్క్వాట్లు, చిన్నప్స్‌ వంటి కసరత్తులు చేయాలి.

చలికాలం ఇక్కడ ఉష్ణోగ్రత మైనస్‌ 25 డిగ్రీలకు పడిపోతుంది. సముద్ర మట్టానికి దాదాపు 15 వేల అడుగుల ఎత్తులో వీరు విధులు నిర్వర్తిస్తుంటారు. సాధారణంతో పోలిస్తే ఇక్కడి వాతావరణంలో ఆక్సిజన్‌ 70 శాతమే ఉంటుంది. మానసిక ఆరోగ్యం కోసం 20 నిమిషాలు ధ్యానం చేయాలి. వీటన్నింటితోపాటు ప్రత్యర్థిపై విరుచుకుపడేలా కిక్‌ బాక్సింగ్‌, బురదలో కుస్తీ వంటి యుద్ధ విద్యలూ నేర్చుకోవాలి. ఇక్కడ విధులు నిర్వర్తించాలంటే ఇవన్నీ తప్పవు. ఆలోచించేలోపే ఎదురుదాడికి దిగితేనే మనుగడ సాధ్యమవుతుంది.

అక్కడ పనిచేస్తున్న సైనికులకు అసలు ప్రత్యర్థి వాతావరణమే. శత్రువుపై విజయం సాధించాలంటే ముందు వాతావరణంపై పైచేయి సాధించాలి. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి ఇలా అన్నింటికీ సమస్యలే. విధులు నిర్వర్తించేవారు నిత్యం కనీసం 4 లీటర్ల నీరు తాగాలి. అత్యంత చలి ప్రాంతంలో శరీరంలో జరిగే జీవక్రియల వల్ల ముక్కు, నోటి నుంటి ఒంట్లోని నీరు వేగంగా ఆవిరి రూపంలో బయటకు వెళుతుంది. అందుకే తగినన్ని నీళ్లు తాగకపోతే డీహైడ్రేషనకు గురవుతారు.

ఇన్ని ప్రతికూల పరిస్థితులు తట్టుకొని విధులు నిర్వర్తించడం దినదినగండమే. గస్తీ నిర్వహించే వారు ఆయుధాలు ధరిస్తారు. కానీ వాటిని వాడాలంటే అధికారులు అనుమతి కావాలి. దీంతో పాటు ఇక్కడ ప్రత్యేకంగా రోడ్లు ఉండవు. కొండలు గుట్టల మీదుగా నడుచుకుంటూ గస్తీ నిర్వహించాలి. ఒక్కోసారి రోజుకు 40 కిలోమీటర్లు కూడా నడవాల్సి ఉంటుంది. దుస్తులు వేసుకునేటప్పుడు ఒంటిమీద ఎక్కడా చిన్న నీటి చుక్క కూడా లేకుండా చూసుకోవాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories