ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం

ముగిసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం
x
Highlights

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్...

తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదాల పరిష్కారానికి మంగళవారం మధ్యాహ్నం ప్రారంభమైన అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం ముగిసింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొన్నారు. దాదాపు రెండు గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెండు తెలుగు రాష్ట్రాలు బలమైన వాదనలను వినిపించాయి.

ప్రధానంగా పోతిరెడ్డి పాడు సామర్థ్యం పెంచడం వంటి అంశాలపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తింది. అయితే తాము కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు నిబంధనల మేరకే పోతిరెడ్డి సామర్థ్యాన్ని పెంచుతున్నామని తెలిపింది. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నామని, దీనిపై అభ్యంతరం ఎందుకని ఏపీ ప్రభుత్వం ప్రశ్నించినట్లు తెలుస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి హైదరాబాద్‌ నుంచి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ దిల్లీలోని సీఎం అధికారిక నివాసం 1-జన్‌పథ్‌ నుంచి అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కౌన్సిల్‌ సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories