Pay Scale: ఉద్యోగుల పేస్కేల్ తగ్గించడం..శిక్షనాత్మక చర్యలతో సమానం..ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం అసహనం

Any phase reduction in pay scaler cover from government employee will have serious consequences Supreme Court
x

Pay Scale: ఉద్యోగుల పేస్కేల్ తగ్గించడం..శిక్షనాత్మక చర్యలతో సమానం..ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీం అసహనం

Highlights

Pay Scale: ప్రభుత్వ ఉద్యోగుల వేతన స్కేలును తగ్గించడం..వారికి చెల్లించిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయడం శిక్షణాత్మక చర్యలతో సమానమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాంటి చర్యలతో తీవ్ర ప్రతికూల పరిణామాలు ఉంటాయని అభిప్రాయ పడింది. ఓ రిటైర్డ్ ఉద్యోగి వేతన స్కేలును తగ్గిస్తూ 2009లో బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి వరకు ఆయన దక్కిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది.

Pay Scale: పే స్కేల్‌లను తగ్గించి, ప్రభుత్వ ఉద్యోగి నుండి డబ్బు వసూలు చేసే ఏ చర్య అయినా శిక్షార్హమైన చర్య అని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది. ఎందుకంటే అది కఠినమైన పౌర ప్రతికూల పరిణామాలను కలిగిస్తుందని వ్యాఖ్యానించింది. బిహార్ కు చెందిన రిటైర్డ్ ఉద్యోగి పే స్కేలును తగ్గిస్తూ అక్టోబర్ 2009లో బీహార్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ఈ మేరకు ధర్మాసనం రద్దు చేసింది. రిటైర్డ్ ఉద్యోగి పే స్కేల్ ను తగ్గించిన బీహార్ సర్కార్ అప్పటివరకు ఆయనకు అధికారికంగా దక్కిన మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని..పొరపాటున అధిక స్కేలు దక్కినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో పదవీవిరమణ చేసిన ఆ ఉద్యోగి న్యాయపోరాటం మొదలు పెట్టారు. సంబంధిత ఉత్తర్వులను పట్నా హైకోర్టులో సవాల్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఉన్న న్యాయస్థానం ఆగస్టు 2012లో సమర్థించింది. దీంతో అతను హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఆర్ మహదేవ్ ల ధర్మాసనం ప్రభుత్వ నిర్ణయంపై సీరియస్ అయ్యింది.

ఆ ఉత్తర్వులు జారీ అయ్యే నాటికే ఉద్యోగి పదవీవిరమణ చేశారని..అంతటి సుదీర్ఘ కాలావ్యవధి తర్వాత ఆయన నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయడం సరికాదని తెలిపింది. బీహార్ ప్రభుత్వంలో సప్లై ఇన్ స్పెక్టర్ గా 1966లో చేరిన అతనికి 15ఏండ్ల తర్వాత ప్రమోషన్ లభించింది. 1981 ఏప్రిల్లో మార్కెటింగ్ ఆఫీసర్ గా ప్రమోట్ అయ్యారు. సర్వీసులో చేరి 1991మార్చి 10 నాటికి 25ఏండ్లు పూర్తవ్వడంతో సీనియర్ గ్రేడ్ హోదా వచ్చింది. మార్కెటింగ్ ఆఫీసర్ కమ్ డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ సప్లై ఆఫీసర్ పోస్టులో నియమించారు. ఆయన పే స్కేలును 1999 ఫిబ్రవరిలో సవరించిన బీహార్ సర్కార్..1996 జనవరి నుంచి అమల్లోకి వచ్చినట్లు పేర్కొంది.

ఏడీఎస్ఓ హోదాలో జనవరి 31, 2001న పదవీ విరమన పొందిన ఆయనకు 2009లో పే స్కేలను తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పే స్కేల్ విషయంలో పొరపాటు జరిగిందని రూ. 63,765 తిరిగి చెల్లించాల్సిందేనని ఆదేశించింది. దీంతో ఆయన బీహార్ ప్రభుత్వ ఉత్తర్వులను హైకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టులో వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన ధర్మాసనం..ఆయన నుంచి రికవరీకి ఆదేశించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. బీహార్ సర్కార్ ఉత్తర్వులను పక్కనపెట్టి..ఈ కేసులో హైకోర్డ్ డివిజిన్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories