మ్యాంగో జ్యూస్‌ అంటూ మాయమాటలు చెప్పి.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం

మ్యాంగో జ్యూస్‌ అంటూ మాయమాటలు చెప్పి.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం
x
Highlights

భారత్‌ను పీడిస్తున్న హేయమయిన నేరాల్లో బాలికలపై అత్యాచారాలు ఒకటి. ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్న ఈ నేరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ...

భారత్‌ను పీడిస్తున్న హేయమయిన నేరాల్లో బాలికలపై అత్యాచారాలు ఒకటి. ముక్కుపచ్చలారని చిన్నారులను చిదిమేస్తున్న ఈ నేరం దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ప్రతి రోజూ జరుగుతూనే ఉందంటే ఆశ్చర్యం కాదు. ఎన్ని చట్టాలున్నా ఈ నేరాలు తగ్గక పోగా రోజురోజుకు పెరుగుతున్నాయి. మొన్నటికి మొన్న తెలంగాణలో పాలుతాగే పసికూనని అత్యాచారం చేసిన ఘటన మరువకే ముందే మరో అత్యాచారం వెలుగులొకి వచ్చింది. తలిదండ్రులు ఇంట్లోలేని సమయంలో ఓ కామందుడు ఆరేళ్ల చిన్నారిపై కాటేసిన ఘటన దేశరాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో చోటుచేసుకుంది. తలిదండ్రులు ఇంట్లో లేని సమయంలో మహ్మద్ నన్హే (24) ఆరేళ్ల చిన్నారికి మ్యాంగో జ్యూస్‌ కొనిస్తానని మాయమాటలు నిర్మాణుశ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

అనంతరం ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఆ పసికూన అలానే ఏడుస్తూ, రక్తపు మడుగులో పడిఉన్న ఆ చిన్నారిని గుర్తించిన ఓ వ్యక్తి దగ్గర్లో ఉన్న ఆస్పత్రిలో చేర్పించాడు. సీసీటీవీ పుటేజ్‌ ఆధారంగా ఆ నిందితుడుని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆరా తీశారు. కాగా ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై డీల్లీ సర్కార్ బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల నష్ట పరిహారం ప్రకటించింది. ఇక ఈ దుర్ఘటనపై డిల్లీ మహిళా కమీషన్‌ స్పందించి నిందితుడికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్‌ చేసింది.




Show Full Article
Print Article
Next Story
More Stories