ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది నక్సల్స్ మృతి

Another massive encounter in Chhattisgarh 10 maoists killed
x

ఛత్తీస్‌గఢ్‌లో మరో భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది నక్సల్స్ మృతి

Highlights

పోలీసులు- మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు

ఛత్తీస్ గఢ్ బస్తర్ లో మంగళవారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎన్ కౌంటర్ జరిగింది. ఇందులో పది మంది మావోయిస్టులు చనిపోయారు. భద్రతా బలగాలు కచ్చితమైన సమాచారం ఆధారంగా దంతెవాడ-బీజాపూర్ జిల్లాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. ఈ సమయంలో తమపై మావోయిస్టులు కాల్పులకు దిగారని... ఆత్మరక్షణ కోసం తాము జరిపిన కాల్పుల్లో ౧౦ మంది నక్సలైట్లు చనిపోయారని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో మరణించిన వారి సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. సంఘటనస్థలంలో పెద్ద ఎత్తున ఆయుధాలను, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories