Anil Deshmukh on Sushant Singh Rajput death: సుశాంత్‌ మరణం పై సీబీఐ విచారణ అవసరం లేదు!

Anil Deshmukh on Sushant Singh Rajput death: సుశాంత్‌ మరణం పై సీబీఐ విచారణ అవసరం లేదు!
x
Sushant Singh Rajput (File Photo)
Highlights

Anil Deshmukh on Sushant Singh Rajput death: బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Anil Deshmukh on Sushant Singh Rajput death: బాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న ముంబైలోని తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు.. అయితే సుశాంత్ ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది. ఇక ఇది ఇలా ఉంటే సుశాంత్ సింగ్ ది అతహత్య కాదని, హత్య అని కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతున్నారు.

ఈ క్రమంలో సుశాంత్‌ మరణం పైన సీబీఐ విచారణ అవసరం లేదు అంటూ మహారాష్ట్ర హోంమంత్రి అన్నారు. సుశాంత్ మరణ కేసును ముంబై పోలీసులు చేధించగలరని అనిల్ దేశ్ ముఖ్ తెలిపారు. సుశాంత్‌ విషాదాంతం కేసులో వ్యాపార శత్రుత్వ కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారని అయన అన్నారు. ఇక దీనికి ముందు సుశాంత్‌ గర్ల్‌ఫ్రెండ్‌ రియా చక్రవర్తి గురువారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆమె ఈ కేసును సీబీఐకి అప్పగించాలని , అతని ఆత్మహత్యకి గల కారణాల గురించి లోతుగా విచారణ చేపట్టాలని ఆమె కోరారు.

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తాజాగా విడుదలైన ట్రైలర్ కి విశేషమైన స్పందన వస్తుంది.Sushanth SIngh Rajput,Suicide,cbi,probe,Anil Deshmukh,సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌, ఆత్మహత్య, సీబీఐ, మహారాష్ట్ర

Show Full Article
Print Article
Next Story
More Stories