Puja khedkar: ఖేద్కర్‌పై ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు

An inquiry committee has been set up in the wake of the allegations against Puja Khedkar
x

Puja khedkar: ఖేద్కర్‌పై ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తు కమిటీ ఏర్పాటు

Highlights

Puja khedkar: యూపీఎస్సీకి తప్పుడు అఫిడవిట్ సమర్పించారన్న ఆరోపణలు

Puja khedkar: ట్రెయినీ IAS పూజా ఖేద్కర్‌ కెరియర్‌ చిక్కుల్లో పడింది. ఆమె అధికార దుర్వినియోగానికి పాల్పడటంతోపాటు, UPSCకి తప్పుడు అఫిడవిట్‌ సమర్పించారన్న ఆరోపణలు రావడంతో కేంద్రం ఏకసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌ అండ్‌ ట్రైనింగ్‌ అదనపు కార్యదర్శి మనోజ్‌ ద్వివేదీ దర్యాప్తు చేపట్టారు. రెండు వారాల్లో ఆయన ఓ నివేదిక ఇవ్వనున్నారు. పుణెలో సహాయ కలెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఖేద్కర్‌పై ఆరోపణలు రావడంతో ఆమెను వాసిమ్‌కు బదిలీ చేశారు.

తన ప్రైవేటు కారుకు సైరన్‌, మహారాష్ట్ర ప్రభుత్వ స్టిక్కర్‌, వీఐపీ నంబర్‌ ప్లేట్లను అనుమతి లేకుండా వినియోగించడంతో మొదలైన వివాదం... తీగ లాగితే డొంక కదిలినట్లుగా ట్రాఫిక్‌ ఉల్లంఘనలు, సెటిల్మెంట్‌లు, ఇతర అధికారులపై ఒత్తిడి చేయడం ఇలా ఒక్కొక్కటీ బయటపడ్డాయి. చివరికి ఆమె UPSC అభ్యర్థిత్వంపైనా అనుమానాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన దర్యాప్తు కమిటీ నివేదిక కీలకంగా మారింది. ఆ నివేదిక ఆధారంగా ఖేద్కర్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories