ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. మణిపూర్‌లో శాంతి నెలకొల్పడంపై చర్చ

An all-party Meeting will be Held Today under the Chairmanship of Amit Shah
x

ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షా అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం.. మణిపూర్‌లో శాంతి నెలకొల్పడంపై చర్చ

Highlights

Amit Shah: అల్లర్లు, హింసాత్మక పరిస్థితులపై చర్చ

Amit Shah: మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులపై చర్చించేందుకు ఇవాళ కేంద్ర హోంశాఖ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. హింసాకాండతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని, సాధారణ స్థితిని పునరుద్ధరించే మార్గాలపై ఆలోచించడమే అఖిలపక్ష సమావేశం ఉద్దేశమని అమిత్ షా చెప్పారు. అంతకుముందు హింసాత్మక మణిపూర్‌కు చెందిన 9 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ప్రధాని మోడీకి లేఖ రాశారు. బీరెన్ సింగ్ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారని నాయకులు ఆరోపించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories