Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం..కూలిన టెర్మినల్ పై కప్పు

Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం..కూలిన టెర్మినల్ పై కప్పు
x

Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ప్రమాదం..కూలిన టెర్మినల్ పై కప్పు

Highlights

Delhi: ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది.ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ 1 వద్ద పైకప్పు కూలింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Delhi: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయింది. విమానాశ్రయంలోని టెర్మినల్-1 వద్ద పైకప్పు కూలిన సమాచారం తెల్లవారుజామున 5.30 గంటలకు అందిందని అగ్నిమాపక శాఖ అధికారి తెలిపారు. ఘటనాస్థలికి మూడు అగ్నిమాపక వాహనాలను పంపించామని తెలిపారు. ఈ ప్రమాదంలో నలుగురికి గాయాలైనట్లు అగ్నిమాపక శాఖ తెలిపింది. పైకప్పు కూలడంతో కొన్ని కార్లు కూడా దెబ్బతిన్నాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఎయిర్ పోర్టులో పైకప్పు కూలడంతో నలుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. విమానాశ్రయంలో చిక్కుకుపోయిన ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నారు. ఒక వ్యక్తి అందులో చిక్కుకున్నాడు. క్షతగాత్రులు ప్రయాణికులా లేక ఎయిర్‌పోర్టు ఉద్యోగులా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.ఈరోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా దేశ రాజధానిలోని పలు ప్రాంతాల్లో జలదిగ్బంధం నెలకొంది. వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌గా మారింది.

ఢిల్లీ, ఎన్‌సీఆర్‌లలో శుక్రవారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఢిల్లీలో వచ్చే ఏడు రోజులపాటు వాతావరణం సాధారణంగా మేఘావృతమై, గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని IMD అంచనా వేసింది. జూన్ 29న వాతావరణం కాస్త చల్లగా ఉంటుందని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రత 36 డిగ్రీల సెల్సియస్ , కనిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ గా ఉండి ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు కురిసే అవకాశం ఉంటుంది. నగరంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, గంటకు 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. జూన్ 30న ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.



Show Full Article
Print Article
Next Story
More Stories