Gas Leak: తమిళనాడు అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ కలకలం.. వందకు పైగా స్థానికులకు తీవ్ర అస్వస్థత

Ammonia Gas Leak in Tamil Nadu
x

Gas Leak: తమిళనాడు అమ్మోనియం గ్యాస్‌ లీక్‌ కలకలం.. వందకు పైగా స్థానికులకు తీవ్ర అస్వస్థత

Highlights

Gas Leak: ఎన్నోర్‌లోని ఫ్యాక్టరీ నుంచి అమ్మోనియా గ్యాస్‌ లీక్‌

Gas Leak: తమిళనాడులో అమ్మోనియా గ్యాస్‌ లీక్‌ కలకలం రేపింది. ఎన్నోర్‌లోని ఓ ఫ్యాక్టరీకి సంబంధించిన గ్యాస్‌ పైప్‌ లీక్‌ కావడంతో పలువురు అస్వస్థతకు గురయ్యారు.. దాదాపు వంద మంది దాకా సొమ్మసిల్లి పడిపోయారు. అస్వస్థతకు గురైన బాధితులు స్థానికులు అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గ్యాస్‌ లీక్‌ జరిగిందని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ తిరువళ్లూరు మెయిన్‌ రోడ్డుపై స్థానికులు బైఠాయించారు.

ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. ఆస్పత్రిలో కోలుకుంటున్న బాధితులను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి పరామర్శించారు. బాధితులకు న్యాయం చేస్తానని, ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories