Manipur Violence: మణిపూర్ హింసపై హోంశాఖ మంత్రి ఆరా..ఉన్నతాధికారులతో అమిత్ షా అత్యవసర భేటీ

Amit Shah Appeals To Maoists To Lay Down Arms Warns Of Action If They Dont
x

Amit Shah: ఆయుధాలు వీడకపోతే.. ఆలౌట్‌ ఆపరేషన్‌ మొదలుపెడతాం

Highlights

Manipur Violence: మణిపూర్ లో నెలకున్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి...

Manipur Violence: మణిపూర్ లో నెలకున్న పరిస్థితులపై కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. అల్లర్లకు కారణాలతో పాటు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ అజిత్ దోవల్, కేంద్ర హోంశాఖ సెక్రటరీ గోవింద్ మోహన్, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ తపన్ డేకాతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మైతీ వర్గీయుల అల్టిమేటమ్ నేపథ్యంలో మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలను రద్దు చేసుకుని హుటాహుటినా ఆదివారమే అమిత్ షా ఢిల్లీకి చేరుకుని అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు.

సోమవారం కూడా అత్యవసర సమావేశం నిర్వహించి..పరిస్థితిని కంట్రోల్ చేసేందుకు కొన్ని సూచనలను చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లకు రక్షణ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు. బీరెన్ సింగ్ పూర్వీకుల ఇంటిపై జరిగిన దాడి గురించి ఆరా తీశారు.

అక్కడి పరిస్థితిని బట్టి కర్ఫ్యూ విధించాలని ఆదేశించినట్లు సమాచారం. అల్లర్లు వ్యాపించకుండా అవసరమైతే మరికొన్ని జిల్లాల్లోనూ కర్ఫ్యూ అమలు చేయాలని, ఇంటర్నేట్ సేవలను కొన్ని రోజుల పాటు షట్ డౌన్ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ బ్రుందం త్వరలో రాష్ట్రంలోని కీలక ప్రాంతాలను సందర్శించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ నేత్రుత్వంలో ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల ఎమ్మెల్యేలు సోమవారం సాయంత్రం సమావేశం అయ్యారు. రాష్ట్రంలో నెలకున్న పరిస్థితిపై చర్చలు జరిపారు. శాంతిస్థాపనకు ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే అంశంపై ఎన్డీఏ మిత్రపక్ష పార్టీ నేతల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అల్లర్లు నియంత్రించడంలో బీరెన్ సింగ్ విఫలం అయ్యారని ఆరోపిస్తూ నేషనల్ పీపుల్స్ పార్టీ ఎన్డీఏకు తన మద్ధతును ఉపసంహరించుకున్నది. ఈ అంశంపై కూడా మిగిలిన పార్టీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories