Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తేదీలను ప్రకటించిన అధికారులు...

Amarnath Yatra starts from June 30 for 43 Days Announced by Officials | Live News
x

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తేదీలను ప్రకటించిన అధికారులు...

Highlights

Amarnath Yatra: జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన అమర్‌నాథ్ బోర్డు భేటీ...

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తేదీలను అధికారులు ప్రకటించారు. జూన్ 30న అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానుందని అధికారులు వెల్లడించారు. ఈ యాత్ర 43 రోజుల పాటు కొనసాగనుంది. సంప్రదాయం ప్రకారం రక్షాబంధన్ రోజున యాత్ర ముగియనుంది. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన నిన్న జరిగిన అమర్‌నాథ్ బోర్డు సమావేశంలో యాత్రకు సంబంధించిన తేదీలను అధికారులు నిర్ణయించారు.

2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేయడంతో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర అర్థాంతరంగా ముగిసింది. కరోనా మహమ్మారి కారణంగా 2020, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ ఏడాది కోవిడ్ రూల్స్ పాటిస్తూ అమర్‌నాథ్ యాత్ర నిర్వహించాలని బోర్డు నిర్ణయించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories