TOP 6 NEWS @ 6PM: Ananth Sriram comments on Tollywood: ప్రభాస్, మహేష్ బాబు సినిమాలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
1)Allu Arjun Latest Updates: అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు... ఈసారి ఎందుకంటే.. సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి...
1)Allu Arjun Latest Updates: అల్లు అర్జున్‌కు నోటీసులు ఇచ్చిన పోలీసులు... ఈసారి ఎందుకంటే..
సికింద్రాబాద్ రాంగోపాల్ పేట్ పోలీసులు అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు. కిమ్స్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు అల్లు అర్జున్ వచ్చే అవకాశం ఉందన్న సమాచారంతో ఆయన్ను అక్కడికి రావొద్దని వారిస్తూ రాంగోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అల్లు అర్జున్ మేనేజర్ మూర్తికి ఈ నోటీసులు ఇచ్చారు. చిక్కడపల్లి పోలీసు స్టేషన్ లో సంతకం చేసేందుకు వెళ్లే క్రమంలోనో లేదా వచ్చే క్రమంలోనో అల్లు అర్జున్ కిమ్స్ కు వచ్చే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో రాంగోపాల్ పేట్ పోలీసులు ఈ నోటీసులు జారీచేశారు. కిమ్స్ హాస్పిటల్ కు వెళ్లి మరోసారి మరో ఘటనకు కారణం కాకూడదని హెచ్చరిస్తూ పోలీసులు ఈ నోటీసులు జారీచేసినట్లు తెలుస్తోంది.
2) HYDRA Demolitions: మాదాపూర్‌లో 5 అంతస్తుల భవనం కూల్చేస్తోన్న హైడ్రా
HYDRA demolishing 5 floors building at Ayyappa Society in Madhapur: హైడ్రా మరోసారి యాక్టివ్ అయింది. ఇటీవల నానక్ రామ్ గూడలో అక్రమ నిర్మాణాలు కూల్చేసిన హైడ్రా తాజాగా హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి చేరుకుంది. ఆదివారం ఉదయం నుండే హైడ్రా మరోసారి కూల్చివేతలకు తెరతీసింది.
అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డుకు ఆనుకుని నిర్మాణంలో ఉన్న 5 అంతస్తుల భవనం గురించి స్థానికులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్... ఆ భవనం అక్రమంగా నిర్మించారని నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఆ తరువాత బుల్‌డోజర్ల సాయంతో ఆ ఐదంతస్తుల భవనాన్ని కూల్చేపని మొదలుపెట్టారు. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
3) Telugu lyricist Ananth Sriram: సినిమా వాళ్లే హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తున్నారు
సినిమాలపై అనంత శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా అనేది వ్యాపారాత్మకమైన కళ, కళాత్మకమైన వ్యాపారం... ఈ రెండిటిని జోడించే క్రమంలో హిందూ ధర్మానికి కళంకం కలుగుతోందన్నారు. తెలుగు సినీరంగంలో జరిగే తప్పులను బాహాటంగానే విమర్శిస్తున్నానని అన్నారు. సినీ రంగానికి చెందిన వాడిగా ఇప్పటివరకు సినిమాల్లో జరిగిన హైందవ ధర్మ వ్యక్తిత్వ హననం సమాజానికి వివరిస్తున్నానని చెబుతూ సినిమా పాటల ధోరణిపై ఆవేదన వ్యక్తంచేశారు.
ముందు తాను సినీ రంగం తరపున హిందూ సమాజానికి క్షమాపణలు చెబుతున్నాను. ఆ క్షమాపణ చెప్పకపోతే ఇక్కడ మాట్లాడే అర్హత కూడా తనకు లేదని అనంత శ్రీరామ్ వ్యాఖ్యానించారు. మన పురాణాలు, ఇతి హాసాల గొప్పతనాన్ని సినిమాల్లో తగ్గించి పాత్రలు మార్చేస్తున్నారు అని అన్నారు. చరిత్రను వక్రీకరించి హిందూ ధర్మాన్ని తక్కువగా చూపిస్తున్నారని వాపోయారు.
వ్యాసుడు, వాల్మీకిల రచనలను వినోదం కోసం వక్రీకరించారు అని చెప్పారు. గత కొన్ని సంవత్సరాల నుంచి నిన్న, మొన్న వచ్చిన కల్కి చిత్రం వరకు ఆ రచనలను అవమానిస్తున్నారు అని అనంత్ శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. ప్రభాస్ హీరోగా వచ్చిన కర్ణుడి పాత్ర గురించి ప్రస్తావిస్తూ... ఆ పాత్రకు అనవసరంగా ఆపాదించిన గొప్పతనాన్ని చూసి సినిమా వాడిగా సిగ్గు పడుతున్నాను అని అన్నారు.
దమ్మారో దమ్ అంటూనే హరే రామ హరే కృష్ణ అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఇస్కాన్ వారి నినాదాన్ని సిగరేట్ తాగుతూ అవమానిస్తారా అని అనంత్ శ్రీరామ్ నిలదీశారు. ఇటువంటి వాటిని చూస్తూ ఊరుకుందామా, సహిద్దామా, భరిద్దామా అని హిందూ సమాజానికి ప్రశ్నలు సంధించారు. రాముడు, కృష్ణుడు గొప్పతనం చెబుతూ సిరివెన్నెల రాసిన పాటలను ఆదర్శంగా తీసుకోండని అనంత్ శ్రీరామ్ హితవు పలికారు.
మహేష్ బాబు నటించిన పోకిరి సినిమా పబ్ సన్నివేశంలో ప్రకాశ్ రాజ్‌కు మహేష్ బాబుని పరిచయం చేసే సన్నివేశంలో బ్యాగ్రౌండ్లో దమ్మారో దమ్ అంటూనే హరే రామ హరే కృష్ణ సాంగ్ ప్లే అవుతుండగా ప్రకాశ్ రాజ్ సిగరెట్ తాగుతూ కనిపిస్తారు. ఈ సీన్ ను ఉద్దేశించే అనంత్ శ్రీరామ్ ఈ వ్యాఖ్యలు చేశారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
4) JC Prabhakar Reddy: మాధవీలత గురించి అలా అనడం తప్పే.. ఐ యామ్ సారీ
JC Prabhakar Reddy's apology to Madhavilatha: సినీనటి మాధవీలతకు జేసీ ప్రభాకర్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆరోజు అలా అనడం తప్పేనని, అందుకే ఇప్పుడు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మాధవీలతపై చేసిన వ్యాఖ్యలు ఆవేశంలో అన్న మాటలేనని తెలిపారు. పొరపాటున ఆవేశంలో నోరుజారానని అంగీకరించారు. ఆ కారణంతోనే తాను ఆమెకు క్షమాపణలు చెబుతున్నట్లు జేసి ప్రభాకర్ రెడ్డి చెప్పారు.
ఇంతకీ గతంలో మాధవీ లత ఏమన్నారు?
తాడిపత్రిలోని జేసీ పార్క్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకలపై మాధవీలత సామాజిక మాధ్యమాల ద్వారా స్పందిస్తూ... జేసీ పార్క్ పరిసరాల్లో పనికిమాలిన వాళ్లు గంజాయి తాగుతూ ఉంటారని, అక్కడికి వెళ్తే మహిళలు సురక్షితంగా ఎలా తిరిగొస్తారని ప్రశ్నించారు. మహిళలే తమ భద్రత గురించి ఆలోచించుకోవాలని మాధవీలత మహిళా లోకానికి సూచించారు. మహిళలకు ఏదైనా జరిగితే మీ జీవితానికి ఎవరు గ్యారెంటీ ఇస్తారని అన్నారు. దయచేసి జేసీ పార్కులో జరిగే న్యూ ఇయర్ వేడుకలకు వెళ్లకూడదని ఆమె పిలుపునిచ్చారు.
5) OYO Hotels - No Entry for Unmarried Couples: ఓయో హోటల్ కొత్త చెక్-ఇన్ రూల్స్ ఇవే
No more entry for unmarried couples into OYO Hotels: దేశవ్యాప్తంగా అన్ని నగరాలు, పట్టణాల్లో హోటల్స్‌తో అగ్రిమెంట్ చేసుకుని లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ బిజినెస్ రన్ చేస్తోన్న ఓయో హోటల్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఈ సిటీలోని హోటల్స్‌లో పెళ్లి కాని జంటలకు ప్రవేశం లేదని ఓయో తేల్చిచెప్పింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని మీరట్ సిటీ నుండి ఓయో ఈ సరికొత్త నిర్ణయం అమలు చేయడం ప్రారంభించింది. మీరట్‌లో ఓయోతో అగ్రిమెంట్ చేసుకున్న హోటల్స్‌కు చెక్-ఇన్ పాలసీని మారుస్తున్నట్లు ఓయో ప్రకటించింది.
ఆన్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకున్నా... ఆఫ్‌లైన్‌లో హోటల్ బుక్ చేసుకున్నా... వారిని లోపలికి అనుమతించేటప్పుడు వారికి పెళ్లి అయిందా లేదా అనేది నిర్ధారించుకున్న తరువాతే హోటల్‌లోకి అనుమతించాల్సిందిగా ఓయో స్పష్టంచేసింది. అంటే మీరట్‌లో ఓయో ప్రవేశపెట్టిన ఈ కొత్త పాలసీ ప్రకారం ఓయో అనుబంధ హోటల్స్‌లో రూమ్ బుక్ చేసుకునే జంటలు తమకు పెళ్లయిందని నిరూపించుకోవాల్సి ఉంటుందన్నమాట. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
6) WTC : భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతు.. ఈ రెండు జట్ల మధ్య టైటిల్ పోరు
WTC : ఆస్ట్రేలియన్ టూర్ టీమ్ ఇండియాకు చాలా దారుణంగా మారింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత జట్టు 1-3 తేడాతో ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. ఈ సిరీస్‌లో ఇరు జట్ల మధ్య చివరి మ్యాచ్ సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగింది. సిరీస్‌ను డ్రాగా ముగించాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాల్సి ఉంది. కానీ కేవలం 3 రోజుల్లోనే మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ ఓటమి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌పై కూడా ప్రభావం చూపింది. ఇప్పుడు ఫైనల్ చేరాలన్న టీమిండియా ఆశలన్నీ అడియాసలయ్యాయి. పూర్తి వార్తా కథనం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire