అఖిలేష్ యాదవ్ పోటీపై క్లారిటీ.. అధికారికంగా ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ

Akhilesh Yadav to Contest From Karhal Constituency
x

అఖిలేష్ యాదవ్ పోటీపై క్లారిటీ.. అధికారికంగా ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ 

Highlights

Uttar Pradesh polls 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ వీడింది.

Uttar Pradesh polls 2022: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ వీడింది. మైన్‌పురి జిల్లా కర్హాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి అఖిలేష్ పోటీ చేస్తారని సమాజ్‌వాదీ పార్టీ శనివారం అధికారికంగా ప్రకటించింది. కొన్నేళ్లుగా మైన్‌పురి జిల్లా సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. ప్రస్తుతం మైన్‌పురి ఎంపీ స్థానానికి ములయాం సింగ్ యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కర్హాల్ నియోజకవర్గంలో 1.44 లక్షల మంది యాదవ ఓటర్లు ఉండటంతో అఖిలేష్ యాదవ్‌‌కు కలిసి వస్తుందని భావిస్తున్నారు. అఖిలేష్ ప్రస్తుతం అజాంగఢ్ లోక్‌సభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అఖిలేష్ యాదవ్ ఓటర్లకు హామీల వర్షం కురిపిస్తున్నారు. రైతులకు భరోసాగా నిలుస్తామని వ్యవసాయ భూముల సేద్యానికి ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటించారు. 22 లక్షల మంది యువతకు ఐటీ రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు గుప్పిస్తున్నారు అఖిలేష్ యాదవ్.


Show Full Article
Print Article
Next Story
More Stories