విమానాశ్రయాలకు క్యూ కడుతున్న జనాలు!

విమానాశ్రయాలకు క్యూ కడుతున్న జనాలు!
x
Highlights

కోవిడ్ తీవ్రత తగ్గుతుండటంతో ప్రయాణాలు జోరుగా సాగుతున్నాయి. విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. విశాఖ నుంచి విమానాలు రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది.

కోవిడ్ తీవ్రత తగ్గుతుండటంతో ప్రయాణాలు జోరుగా సాగుతున్నాయి. విమాన ప్రయాణాలు ఊపందుకున్నాయి. విశాఖ నుంచి విమానాలు రాకపోకలు సాగించే వారి సంఖ్య క్రమంగా పెరగుతోంది. సుదూర ప్రయాణానికి మరో మార్గం లేకపోవడమే ఇందుకు కారణం. కోవిడ్ నిభందనలు పకడ్బందీగా అమలు చేస్తున్న నేపథ్యంలో ప్రయాణికులు.. విమాన సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారని అధికారులు చెబుతున్నారు.

దేశీయ విమానయాన సంస్థలపై కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బ కొట్టింది. మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌తో విమాన ప్రయాణాలు కొన్ని నెలల పాటు ఆగిపోయాయి. కేంద్రప్రభుత్వం విడతల వారీ లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో ప్రజలు ఇబ్బంది లేకుండా రాకపోకలు సాగిస్తున్నారు. విమానాశ్రయాలకు కూడా జనాల రాక క్రమంగా పెరుగుతోంది. విమానాల్లో ప్రయాణాలు చేసే విశాఖ వాసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఎక్కువమంది ప్రయాణికులు విశాఖ నుంచి.. హైదరాబాద్, ఢిల్లీ, బెంగుళూరు వంటి ప్రాంతాలకు ప్రయాణిస్తున్నారు. దీంతో ప్రయాణికులు సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతుందని ఎయిర్‌పోర్ట్‌ అధికారి రాజ్‌ కిషోర్ తెలిపారు.

మే నుంచి తిరిగి ప్రారంభమైన డొమెస్టిక్ విమాన ప్రయాణాలు అక్టోబర్‌ నాటికి క్రమక్రమంగా పెరిగాయని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. అక్టోబర్‌ నెలలో ప్రతిరోజూ దాదాపు 4 వేల మంది విమానాల ద్వారా ప్రయాణం చేస్తున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అధికారి రాజ్‌ కిషోర్ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories