Corona Vaccination: సెప్టెంబరు లోపే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్

AIIMS Chief Says Corona Vaccination For Children Before September Month
x

కరోనా వ్యాక్సిన్‌ 

Highlights

* అనుమతుల కోసం వేచిచూస్తున్న జైకోవ్-డి, కొవాగ్జిన్ * ట్రయల్స్ జరుగుతున్నాయన్న ఎయిమ్స్ చీఫ్​క్లారిటీ గులేరియా

Corona Vaccination: ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి టీకా ప్రక్రియ కొనసాగుతోంది. మరి పిల్లలకు ఎప్పుడు టీకా అందుబాటులో వస్తుందన్న ప్రశ్నలకు ఎయిమ్స్‌ చీఫ్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా తెరదించారు. వచ్చే వారాల్లో లేదా సెప్టెంబరులోపే పిల్లలకు కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులో వచ్చే అవకాశాలున్నాయని తెలిపారు. జైడస్ క్యాడిలా ఫార్మా సంస్థ జైకోవ్-డీ పేరుతో వ్యాక్సిన్ అభివృద్ధి చేసిందని, ఇది 12 ఏళ్లకు పైబడిన వారిపై పనిచేస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ప్రయోగాలు కూడా పూర్తయ్యాయని వివరించారు. చిన్నారులపై కొవాగ్జిన్ ట్రయల్స్ కూడా పూర్తి కావొస్తున్నాయని, అనుమతులు రాగానే పిల్లలకు టీకాలు ఇచ్చే కార్యక్రమం షురూ అవుతుందని వివరించారు. సెప్టెంబరు లోపే పిల్లలకు వ్యాక్సినేషన్ ఉంటుందని రణదీప్ గులేరియా వెల్లడించారు. అటు, చిన్నారులకు ఇచ్చేందుకు గాను మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లకు అనుమతులు లభించాయని అన్నారు

Show Full Article
Print Article
Next Story
More Stories