Corona Third Wave: కరోనా థర్డ్‌వేవ్ అనివార్యం- ఎయిమ్స్‌చీఫ్ గులేరియా

AIIMS Chief Doctor Randeep Guleria Says Corona Third Wave Likely to hit 6 to 8 weeks
x
ఏఐమ్స్ డాక్టర్ రణదీప్ గులేరియా (ఫైల్ ఇమేజ్)
Highlights

Corona Third Wave: అన్‎లాక్ వేళ గులేరియా హెచ్చరిక * 6 నుంచి 8 వారాల్లో థర్డ్‌వేవ్- గులేరియా

Corona Third Wave: రోనాపై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. కరోనా థర్డ్‌వేవ్ తప్పదనే సంకేతాలు ఇచ్చింది. కేసులు తగ్గాయని అజాగ్రత్తగా ఉండొద్దని సూచించింది. ఇక టెస్టింగ్‌, ట్రాకింగ్, ట్రీటింగ్, వ్యాక్సినేషన్ మాత్రం ఆపొద్దని సూచనలు చేసింది. లాక్‌డౌన్‌ సడలింపుల్లోనూ పకడ్బందీగా నిబంధనలు అమలు చేయాలని నిబంధనల అమలుపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలంది కేంద్ర ప్రభుత్వం. కేసులు పెరిగితే ఆంక్షలు అమలు చేయాలన్న కేంద్రం.. మాస్క్‌లు ధరించి భౌతికదూరం పాటించాలని తెలిపింది.

కరోనా థర్డ్‌వేవ్ అనివార్యమన్నారు ఎయిమ్స్‌ చీఫ్‌ రణ్‌దీప్ గులేరియా. డోస్ మధ్య గ్యాప్ కాదు.. వేవ్‎ల మధ్య గ్యాప్ తగ్గిపోతోందన్నారు. 6 నుంచి 8 వారాల్లో థర్డ్‌వేవ్ ఎఫెక్ట్ ఉండనుందన్నారు. థర్డ్‌వేవ్‎ను డిసైడ్ చేసేది మనమేనని మన చేతిలోనే మూడో ముప్పు ఉందన్నారు గులేరియా. సెకండ్‌ వేవ్ చూశాక కూడా జనాల్లో నిర్లక్ష్యం పోలేదన్నారు. ఫస్ట్‌‌వేవ్ తర్వాత రిలాక్స్‌ అయ్యాం.. వెంటనే సెకండ్ వేవ్ దెబ్బ కొట్టిందన్నారు గులేరియా. జాగ్రత్తగా ఉండకపోతే ముప్పుతప్పదన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories