AIADMK Manifesto: మేనిఫెస్టో విడుదల చేసిన అన్నాడీఎంకే

AIADMK Party Released the Manifesto
x

ఫైల్ ఫోటో 

Highlights

AIADMK Manifesto: 164 హామీలతో మేనిఫెస్టో * ఉచిత వాషింగ్ మెషిన్లు, కేబుల్ టీవీని పొందు పరిచిన పళనిస్వామి

AIADMK Manifesto: తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠను రేపుతున్నాయి. ప్రధాన పార్టీలు ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ఉచితాల పర్వానికి తెరలేపారు.. డీఎంకే మేనిఫెస్టో విడుదల చేసిన మరుసటి రోజే అధికారపార్టీ అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది మొత్తం 164 హామీలను మేనిఫెస్టోలో పొందుపరిచింది. సీఎం పళనిస్వామి ఆదివారం దీన్ని విడుదల చేశారు..

తమిళనాడులో ప్రధాన పార్టీలో ఎన్నికల్లో దూసుకుపోతున్నాయి. ఓటర్లే టార్గెట్‌గా ఉచితాలకు పెద్దపీట వేస్తూ మేనిఫెస్టో‌లు విడుదల చేస్తున్నారు. శనివారం డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్ మేనిఫెస్టో విడుదల చేస్తే ఆదివారం సీఎం పళనిస్వామి మేనిఫెస్టో విడుదల చేశారు.. ఇందులో ‎ఉచిత వాషింగ్ మిషన్లు, కేబుల్ టీవీ వంటివి పొందుపరిచారు.

ఇళ్లు లేని వారందరికీ ఉచిత గృహాలు, ఇంటికో ఉద్యోగం, వాషింగ్‌ మెషిన్లు, ఉచిత సోలార్ స్టవ్‌లు, అందరికీ కేబుల్ టీవీ సౌకర్యం కల్పిస్తామని అన్నాడీఎంకే తన మేనిఫెస్టోలో పేర్కొంది. అమ్మ హౌసింగ్ స్కీమ్ ద్వారా ప్రస్తుతం ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామని మేనిఫెస్టోలో భరోసా ఇచ్చారు.. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించి, ఉచితంగా ఇళ్లు కట్టించి ఇస్తామని, పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లోనే రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌ నిర్మించి ఇస్తామన్నారు..

అన్నాడీఎంకే ఇప్పటికే రైతుల పంట రుణాల మాఫీ చేస్తామని, విద్యార్థులకు విద్యా రుణాలు మాఫీ చేస్తామని, ఏడాదంతా విద్యార్థులకు 2జీబీ ఉచిత డాటా అందిస్తామని హామీ ఇచ్చింది. అంతేకాదు మొదటి సారి చమురు ధరలను మేనిఫెస్టోలో పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని భరోసా ఇచ్చింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అన్నాడీఎంకే పలు హామీలు ఇచ్చింది. గృహాణిలకు ప్రతి నెలా 1,500 రూపాయలు ఇవ్వడంతో పాటు, ఏటా 6 ఎల్‌పీజీ డొమెస్టిక్ సిలెండర్లు ఉచితంగా ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు..

ఉపాధి హామీ పనిదినాలను 100 నుంచి 150 దినాలకు పెంచుతామని పేర్కొంది. ఆటో రిక్షాలు కొనుగోలు చేయాలనుకునే వారికి 25వేలు సబ్సిడీ, శ్రీలంక తమిళ శరణార్దులకు ద్వంద్వ పౌరసత్వం, విద్యారుణాల రద్దు, మద్యం దుకాణాల తగ్గింపు వంటివీ ఇందులో ఉన్నాయి. టౌన్ బస్సులలో ప్రయాణించే మహిళలకు టిక్కెట్ రేటులో 50 శాతం రాయితీలతో పాటు.. మొత్తంగా 164 అంశాలతో కూడిన మేనిఫెస్టో తమిళ ప్రజలను ఏ మేరకు ఆకట్టుకుంటాయో చూడాలి..

Show Full Article
Print Article
Next Story
More Stories