The Elephant Whisperers: ఆస్కార్తో సెలబ్రిటీలుగా మారిపోయిన ఏనుగులు

After The Elephant Whisperers Oscar win the Elephants Become Tourist Attraction
x

The Elephant Whisperers: ఆస్కార్తో సెలబ్రిటీలుగా మారిపోయిన ఏనుగులు

Highlights

The Elephant Whisperers: ఈ డాక్యుమెంటరీలో కీలక పాత్ర వహించిన ఏనుగులపై ప్రపంచ ఫోకస్

The Elephant Whisperers: ఆస్కార్ అవార్డు దక్కించుకున్న 'ది ఎలిఫెంట్ విస్పర్స్' డాక్యుమెంటరీలో ఉన్న ఏనుగులు ఒక్కసారిగా ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆస్కార్ గెలవడంతో ఈ ఏనుగులు సెలబ్రిటీలుగా మారిపోయాయి. ఈ డాక్యుమెంటరీ చిత్రంతో తమిళనాడులోని నీలగిరి జిల్లా ముదుమలై రిజర్వు ఫారెస్ట్‌కు సమీపంలోని తంగల్‌ అనే ఒక చిన్న గ్రామం పేరు ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీంతో ఏనుగులను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు తరలివస్తున్నారు. ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరం టూరిస్టులుతో కిటకిటలాడుతోంది.

ది ఎలిఫెంట్ విస్పర్స్ అనే తమిళ డాక్యుమెంటరీని కార్తికి గోన్సాల్వేస్ తెరకెక్కించారు. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ది ఎలిఫెంట్ విస్పర్స్ ఆస్కార్ అవార్డును దక్కించుకుంది. దీంతో ఎలిఫెంట్ విస్పర్స్ ద్వారా ఫేమస్ అయిన ఏనుగు పిల్లను చూసేందుకు ముదుమలై తెప్పకాడు ఏనుగుల శిబిరానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దేశ, విదేశాల నుంచి వస్తున్న పర్యాటకులు ఇక్కడి ఏనుగులను చూసి మంత్రముగ్దులవుతున్నారు. పైగా ఆ గ్రామవాసులంతా వచ్చి బొమ్మన్‌ దంపతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అలాగే స్థానిక ప్రభుత్వ, అటవీ శాఖ అధికారులు కూడా ఆ దంపతుల ఇంటికి వచ్చి వారిని అభినందించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories