Cowin Registrations: గంటల వ్యవధిలోనే 1.33 కోట్ల మంది రిజిస్టర్

Above 1 Crore 30 Lakhs Cowin Registrations
x

 Cowin Registrations:(File Image)

Highlights

Cowin Registrations: టీకా కావాలని భావించే వారు కొవిన్ వెబ్ సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటూ, ఆరోగ్య శాఖ కోరింది.

Cowin Registrations: మరో నాలుగు వారాలు కరోనా విజృంభణ కొనసాగుతోందని అందరూ చాలా జాగ్రత్తగా వుండాలని వైద్యులు సూచించారు. అయితే భారత్ లో18 ఏళ్లు పైబడిన వారందరికీ మే 1 నుంచి వ్యాక్సిన్ అందించనున్నారు. దేశంలో ఎక్కువ మంది యువతే ఉన్నందున ఇదే అతి పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ కానుంది. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే కోవిన్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. చాలా మంది యువత ఎగబడడంతో మొదట సాంకేతిక సమస్యలు వచ్చాయి. సర్వర్ డౌన్ అయింది. ఐనప్పటికీ చాలా మంది యువత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కేవలం 3 గంటల్లో 80లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల వరకు ఇంత భారీ స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి.

''కోవిన్ పోర్టల్‌లో గంటలోనే 35 లక్షల మంది రిజిస్ట్రేషన్స్ చేసుకున్నారు. సాయంత్రం 7 గంటల వరకు 79,65,720 మంది టీకా కోసం దరఖాస్తు చేసుకున్నారు. చివరి మూడు గంటల్లోనే ఎక్కువ మంది పోర్టల్‌కు వచ్చారు. వయసు వారీగా వివరాలు మాత్రం ప్రస్తుతం అందుబాటులో లేవు. కానీ 18 నుంచి 44 ఏళ్ల వయస్సు వారే ఎక్కువగా నమోదు చేసుకున్నారు.'' అని కోవిన్ చీఫ్ ఆర్ఎస్ శర్మ తెలిపారు.

కరోనా వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ కోసం యువత పెద్ద ఎత్తున కోవిన్ పోర్టల్‌లో లాగిన్ అయ్యేందుకు ప్రయత్నించడంతో వెబ్‌సైట్ కాసేపు క్రాష్ అయింది. ఓటీపీలు ఆలస్యంగా వచ్చాయి. వేలాది మందికి సర్వర్ సమస్యలు వచ్చాయి. ఆరోగ్య సేతు కూడా కాసేపు నిలిచిపోయింది. సర్వర్ ఎర్రర్ మెసేజ్ చూపించింది. ఈ సమస్య ఎదురైన వారంతా సోషల్ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా కొత్తగా 17,23,912 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 28 కోట్ల 27లక్షల 03వేల 789 టెస్ట్‌లు చేశారు. కొత్తగా 25,56,182 మందికి వ్యాక్సిన్లు వేశారు. ఇప్పటివరకు 14కోట్ల 78లక్షల 27వేల 367 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు.

కోవిడ్ అని తెలియగానే ఆసుపత్రులకు పరుగులు పెట్టొద్దు. అదే సమయంలో అలసత్వమూ పనికి పనికి రాదు. జ్వరం, దగ్గు, జలుబు, కళ్లలో మంట, కళ్లు ఎర్రబడడం, ఒళ్ళు నొప్పలు, తలనొప్పి, విరేచనాలు, రుచి, వాసన కోల్పోవడం తదితర లక్షణాలుంటే కోవిడ్ పరీక్షను వెంటనే చేయించుకోవాలి. అలాగూ 101 డిగ్రీల కంటే జ్వరం ఎక్కువగా ఉంటుంటే... ఆక్సిజన్ శాతం పడిపోతుంటే... నడుస్తుంటే ఆయాసం వస్తుంటే... వెంటనే ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సూచిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories