INDIA Alliance: పంపకాలపై క్లారిటీ రాకముందే నిర్ణయం వెల్లడించిన ఆప్
INDIA Alliance: ఇండియా కూటమిలో మరో ముసలం బయటపడింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో అన్ని రాష్ట్రాల్లోనూ సమష్టిగా పోటీ చేయాలనే ప్రకటించిన కొన్నిరోజులకే ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం ఆసక్తిని కలిగిస్తోంది. పంజాబ్లో ఉన్న 13 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. రాబోయే లోక్సభ ఎన్నికల్లో సాధ్యమైనంత వరకూ కలిసికట్టుగానే పోటీ చేయాలని ముంబై సమావేశంలో ఇండియా కూటమి ఒక తీర్మానం చేసింది. వివిధ రాష్ట్రాల్లో సీట్ల పంపకాలకు సంబంధించిన ప్రక్రియను తక్షణం ప్రారంభించాలని, ఇచ్చిపుచ్చుకునే స్ఫూర్తితో ఈ ప్రక్రియను ఒక కొలిక్కి తీసుకురావాలని ఆ తీర్మానం చేశారు. అయితే సీట్ల పంపకాల అంశం ఓ కొలిక్కిరాకముందే ఆప్ ప్రకటన ఇండియా కూటమిలో చర్చకు దారి తీసింది.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire