Navjot Sidhu: కాంగ్రెస్‌కు గుడ్‌ బై చెప్పే యోచనలో సిద్ధూ?

Aap Always Recognized my Work Says Navjot Sidhu
x

నవజోత్ సిద్ధూ (ఫైల్ ఇమేజ్)

Highlights

Navjot Sidhu: రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో ఆప్‌ పార్టీకి బాగా తెలుసు: సిద్ధూ

Navjot Sidhu: పంజాబ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కాంగ్రెస్‌ నేత నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ ఆప్‌ గూటికి చేరనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్‌ దీనికి మరింత బలం చేకూర్చుతోంది. తన పని తీరును ఆమ్ఆద్మీ పార్టీ గుర్తించిందని, రాష్ట్రం కోసం ఎవరు పోరాడుతున్నారో ఆప్‌ పార్టీకి బాగా తెలుసని తెలిపారు.

2017లో భాజపాను వీడి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో సిద్ధూను ఆప్‌ నేత సంజయ్‌ సింగ్ అభినందించారు. ఆకాలీదళ్‌కు, బాదల్‌ కుటుంబానికి వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమవ్వడాన్ని ప్రశంసిస్తూ అప్పట్లో ట్వీట్‌ చేశారు. దానికి సమాధానంగా సిద్ధూ ప్రస్తుతం రీట్వీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగా తీవ్ర సంక్షోభం ఏర్పడింది. ముఖ్యమంత్రి అమరీందర్‌సింగ్‌కు, నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూకు మధ్య ఏర్పడిన విభేదాలను చక్కదిద్దేందుకు అధిష్ఠానం ప్రయత్నించింది. వారం రోజుల క్రితం అమరీందర్‌తో సోనియాగాంధీ దాదాపు 90 నిమిషాల పాటు చర్చించారు. రాహుల్‌ గాంధీ చొరవతో నవ్‌జోత్‌సింగ్‌కు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగిస్తారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ, తాజాగా సిద్ధూ చేసిన ట్వీట్‌ ఆయన కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి ఆప్‌లో చేరుతారనే ఊహాగానాలకు ఊతమిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories