Aadhaar-PAN linking deadline extended: పాన్‌- ఆధార్‌ లింక్‌ గడుపు పెంపు

Aadhaar-PAN linking deadline extended: పాన్‌- ఆధార్‌ లింక్‌ గడుపు పెంపు
x
Highlights

Aadhaar-PAN linking deadline extended :పౌరులకు ఉపశమనం కలిగించే విధంగా, కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ‌- ఆధార్‌ కార్డ్‌ లింక్‌ గడువును మరోసారి పొడిగించింది.

Aadhaar-PAN linking deadline extended: పౌరులకు ఉపశమనం కలిగించే విధంగా, కేంద్ర ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. పర్మనెంట్ అకౌంట్ నంబర్ (పాన్) ‌- ఆధార్‌ కార్డ్‌ లింక్‌ గడువును మరోసారి పొడిగించింది. ఆధార్ కార్డు , పాన్ కార్డును 2021 మార్చి 31 లోపు అనుసంధానించుకోవచ్చని తెలిపింది. దేశంలో కరోనా వైరస్‌ దృష్ట్యా ఆదాయపు పన్నుశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు‌ కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే. ఆధార్ చట్టబద్దతపై 2018 సుప్రీంకోర్టు తీర్పు తరువాత , ఆదాయపు పన్ను రిటర్నులను (ఐటిఆర్) దాఖలు చేయడానికి 12 అంకెల గుర్తింపు సంఖ్యను పాన్ కార్డుతో లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

కొత్త పాన్ కార్డు కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ, ఆధార్ నంబర్‌ను తప్పకుండా లింక్ చేసుకోవాలి. ఇప్పటికే ఉన్న పాన్ కార్డ్ హోల్డర్ల కోసం, చివరి తేదీలోపు ఆధార్‌తో లింక్ తప్పనిసరిగా చేసుకోవాలని ఆదాయపు పన్ను సూచించింది. ఇక పాన్‌ను ఆధార్‌తో అనుసంధానించడానికి, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి, ఎడమ వైపున ఉన్న లింక్ ఆధార్ విభాగంలో క్లిక్ చేయాలి. అక్కడ పాన్ నంబర్, ఆధార్ నంబర్ మరియు పేరు నింపాలి. పేరు, పుట్టిన తేదీ మరియు లింగాన్ని ఐటి విభాగం ధృవీకరిస్తుంది, ఆ తర్వాత లింక్ చేయబడుతుంది.


Show Full Article
Print Article
Next Story
More Stories