Aadhaar: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గమనిక.. వీటి మార్పునకు లిమిట్‌ ఉంటుందని తెలుసా..!

Aadhaar Card has a Limit to Change Name and Address
x

Aadhaar: ఆధార్‌ కార్డు ఉన్నవారికి గమనిక.. వీటి మార్పునకు లిమిట్‌ ఉంటుందని తెలుసా..! 

Highlights

Aadhaar: కాలం మారుతున్న కొద్దీ ఆధార్ కార్డ్‌ చాలా శక్తివంతంగా తయారవుతుంది.

Aadhaar: కాలం మారుతున్న కొద్దీ ఆధార్ కార్డ్‌ చాలా శక్తివంతంగా తయారవుతుంది. ఇప్పుడు అన్ని పత్రాలతో పోలిస్తే ఆధార్‌ చాలా ముఖ్యమైన పత్రం. ఆధార్ కార్డ్ లేకుంటే చాలా పనులు అసంపూర్తిగా మిగులుతాయి. అంతేకాకుండా ప్రభుత్వ పథకాలకు దూరమవుతారు. ఆధార్ కార్డు అవసరాలు, ప్రాముఖ్యతను లెక్కలోకి తీసుకొని అనేక సార్లు మార్పులు చేయడం లేదా నవీకరించడం జరుగుతుంది. ఆధార్ కార్డును జారీ చేసిన ప్రభుత్వ సంస్థ UIDAI ఆధార్ కార్డులో అవసరమైన మార్పులు చేసుకోవడానికి అనుమతిస్తుంది. కానీ ఇది పరిమితం. లెక్క దాటితే మీరు ఆధార్ కార్డ్‌లో మార్పులు చేయలేరు.

చాలా సార్లు ఆధార్ కార్డులో మీ పేరు తప్పుగా ఉంటుంది. లేదంటే పెళ్లి తర్వాత అమ్మాయిలు ఆధార్‌లో ఇంటిపేరును మార్చుకోవాల్సి ఉంటుంది. మీరు మీ ఆధార్‌లోని పేరును రెండుసార్లు మాత్రమే మార్చుకోగలరు లేదా అప్‌డేట్ చేయగలరని గుర్తుంచుకోండి. దీని తర్వాత మీరు మీ పేరును అప్‌డేట్ చేయాలనుకుంటే కొన్ని ముఖ్యమైన పత్రాలతో UIDAI ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లాల్సి ఉంటుంది.

ఉద్యోగం లేక మరేదైనా కారణాల వల్ల మనం చాలాసార్లు ఇల్లు మారాల్సి వస్తుంది. ఈ పరిస్థితిలో ఆధార్ కార్డులోని చిరునామాను కూడా మార్చాలి. కానీ ఆధార్ కార్డ్‌లో ఒక్కసారి మాత్రమే చిరునామాను మార్చగలరని గుర్తుంచుకోండి. మార్చి 31లోగా ఆధార్ కార్డును పాన్‌తో అనుసంధానం చేయాల్సి ఉంది. భారత ప్రభుత్వం ఆధార్, పాన్ లింక్ చేయడాన్ని తప్పనిసరి చేసింది. మీరు ఇంకా మీ ఆధార్, పాన్‌ను లింక్ చేయనట్లయితే మార్చి 31, 2022 వరకు సమయం ఉంది. ఈలోగా చేసుకోండి. లేదంటే పాన్‌కార్డ్‌ ఎక్కడా చెల్లదు.

Show Full Article
Print Article
Next Story
More Stories