బెంగళూరులో దారుణం.. స్కూటీతో పాటు వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన యువకుడు

A Young man Dragging an old Man with a Scooty in Bengaluru
x

బెంగళూరులో దారుణం.. స్కూటీతో పాటు వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన యువకుడు 

Highlights

Bengaluru: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Bengaluru: కర్నాటక రాజధాని బెంగళూరులో దారుణం జరిగింది. ఓ యువకుడు తాను చేసిన యాక్సిడెంట్ నుంచి తప్పించుకునేందుకు ఓ వృద్ధుడిని స్కూటీతో పాటు కొంతదూరం ఈడ్చుకెళ్లాడు. దీంతో ఆ రోడ్డులో వెళ్తున్న వాహనదారులు ఇది గమనించి కేకలు వేసినా యువకుడు పట్టించుకోలేదు. దీంతో తమ వాహనాలను అడ్డుపెట్టి స్కూటీని ఆపేశారు. బెంగళూరులోని మగది రోడ్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకోగా..సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. గాయపడిన వృద్ధుడిని చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories