Ayodhya Ram Mandir: అయోధ్యరామమందిరానికి అద్భుతమైన విరాళం

A Wonderful Donation to the Ayodhya Ram Temple
x

Ayodhya Ram Mandir: అయోధ్యరామమందిరానికి అద్భుతమైన విరాళం

Highlights

Ayodhya Ram Mandir: 108 అడుగుల పొడవాటి అగరబత్తి తయారు చేసిన భక్తుడు

Ayodhya Ram Mandir: శరవేగంగా నిర్మాణం జరుగుతున్న అయోధ్య రామ మందిరానికి ఓ భక్తుడు అద్బుతమైన విరాళం ఇవ్వబోతున్నాడు. వడోదరకు చెందిన వ్యక్తి 108 అడుగుల పొడవాటి అగరబత్తిని తయారు చేసి అందరిని ఆశ్చర్యానికి గురిచేసాడు. ఈ ఏడాది అక్టోబరు నాటికి మందిరం గ్రౌండ్‌ ఫ్లోర్‌ నిర్మాణం పూర్తవుతుందవుతుండగా అతను తయారు చేసిన అగరుబత్తిని రామమందిరానికి విరాళంగా ఇవ్వబోతున్నాడు. అగరుబత్తిని తయారు చేసేటప్పుడు బ్రహ్మచర్యాన్ని అనుసరించాడు.

ఇతరులను తాకడానికి అనుమతించలేదు. అగరుబత్తీతయారు చేయడానికి రామభక్తులు తనకు సహకరించారని చెప్పాడు. ప్రస్తుతం వర్షం కారణంగా పనులు నిలిపివేసినప్పటికీ వర్షం కురిసిన తర్వాత మళ్లీ అగరబత్తి తయారీ పనులు చేపట్టనున్నారు. అగరుబత్తీల తయారీలో 3వేల 4వందల కిలోల మెటీరియల్‌ను ఉపయోగించారు. వడోదర నుంచి అగరుబత్తీలు తీసుకువెళ్లడం చాలా పెద్ద విషయం కాబట్టి 4 లక్షలు ఖర్చవుతుందని తెలిపాడు. అగరుబత్తి రక్షణ కోసం రామాలయానికి సమర్పించేటప్పుడు భద్రత కోసం ఆయన ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి, గుజరాత్‌ సీఎంల సహాయం కోరారు.

Show Full Article
Print Article
Next Story
More Stories