Modi vs KCR: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ల మధ్య పెరిగిన దూరం

A Political Conflict Caused by Differences of Opinions
x

Modi vs KCR: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్‌ల మధ్య పెరిగిన దూరం

Highlights

Modi vs KCR: భిన్నాభిప్రాయాలతో ఏర్పడిన రాజకీయ వైరం

Modi vs KCR: భిన్నాభిప్రాయాలతో ఏర్పడిన రాజకీయ వైరం... క్రమేణ ప్రశ్ఛన్నయుద్ధానికి దారితీసింది. అనతికాలంలోనే పరస్పర కక్షసాధింపులు... ఎంక్వరీ వార్‌... ఇరువర్గాలను ముప్పుతిప్పలు పెట్టిస్తున్నాయి. ఇన్నాళ్లు మాటల తూటాలతో వైరాన్ని ప్రకటించిన నేతలు... తాజాగా ధర్యప్తు సంస్థల మాటున ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పోటా పోటీగా ధర్యాప్తు సంస్థల నోటీసులు రాజకీయ నాయకులకు కంటిమీద కునుకులేకుంటా పోతున్నాయి. ఏ సమయంలో ఏంజరుగుతుంది, పరిణామాలు ఎలా మారుతాయనే అంశంపై చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలో ఎమ్మెల్యేలకు ఎర కేసు బీజేపీ నాయకులకు తలనొప్పిగా మారింది. బీజేపీ అగ్రనేతలు మాత్రం సంబంధంలేదని చెబుతున్నప్పటికీ... సిట్ ధర్యాప్తులో భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యదర్శి బిఎల్ సంతోష్‌కు నోటీసులు జారీచేయడంతో జాతీయ స్థాయిలో రాజకీయ ప్రకంపనలకు దారితీసింది.

ఇది ఇలా ఉండగా తాజాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కల్వకుంట్ల కవితకు నోటీసు జారీ చేయడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. గత కొంతకాలంగా లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత పేరుందని ప్రచారం జరిగినప్పటికీ, ఢిల్లీలో అరెస్టయిన అరోరా రిమాండ్ రిపోర్టులో కల్వకుంట్ల కవిత పేరును పేర్కొన్నారు. దీంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ అయ్యాయి. దీంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

నిన్న మొన్నటిదాకా సందర్భమేదైనా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడటంతో బీజేపీపట్ల వ్యతిరేకతను స్పష్టంగా వ్యక్తీకరించారు. ధాన్యం కొనుగోలు - రైతుల ఇబ్బందులకు సంబంధించి ఢిల్లీలో ప్రజాప్రతినిధులతో ఆందోళనకు దిగడం, ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్‌ పర్యటనకొచ్చినపుడు మొహంచాటేసిన కేసీఆర్ రాజకీయంగా వైరాన్ని, వ్యక్తిగతంగా దూరాన్ని పెంచుకున్నారు. ప్రభుత్వ సంబంధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వచ్చిన సందర్భాల్లోనూ కేసీఆర్ మొహంచాటేసి తన వ్యతిరేకతను స్పష్టంచేశారు. ప్రజా బలం ఉన్నంవరకు మోడీ, ఈడీలు ఏమీ చేయలేవని కేసీఆర్ గట్టిగా హెచ్చరించారు.

ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనకొచ్చినపుడు కేసీఆర్‌ వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ నాయకులు చేసిన రకరకాల ఫిర్యాదులతో సభావేదికపైనుంచే హెచ్చరిక సంకేతాలు జారీ చేశారు. అవినీతి, అక్రమాలకు పాల్పడేవారిని, ఇబ్బంది పెట్టేవారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని హైదరాబాద్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించారు.

కారణాలేమైనా... ఇరు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు ఇరువర్గాలను ముప్పు తిప్పలు పెట్టిస్తున్నాయి. ధర్యాప్తు సంస్థలతో ఇరుపార్టీల నాయకులను ఇబ్బందుల్లోకి నెట్టేశారు. అటు బీజేపీ జాతీయ కార్యదర్శి బీఎల్ సంతోష్ కోర్టును ఆశ్రయించి ధర్యాప్తు సంస్థ విచారణను తప్పుకునే ప్రయత్నం చేశారు. తాజాగా ఢిల్లీ కేంద్రంగా వెలుగుచూసిన లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీచేయడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఈనెల 6 తేదీన విచారణ అనంతరం పరిణామాలు ఎలా ఉండబోతాయనే అంశం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories