Joe Biden ఒకరోజు ముందే అమెరికా అధ్యక్షుడి భారత్ టూర్

A Day Before the US President to India Tour
x

Joe Biden: ఒకరోజు ముందే అమెరికా అధ్యక్షుడి భారత్ టూర్

Highlights

Joe Biden: ఇవాళ సా.7 గం.కు బైడెన్‌తో భేటీకానున్న ప్రధాని మోడీ

G20 Summit: జీ20 సమావేశాల కోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఢిల్లీ రానున్నారు. శిఖరాగ్ర సమావేశానికి ఒకరోజు ముందే బైడెన్‌ భారత్‌ను సందర్శించే అవకాశం ఉంది. అయితే ఇవాళ సాయంత్రం 7 గంటలకు ప్రధాని మోడీతో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వర్గాలు తెలిపాయి. ఇరువురు నేతలు కీలక ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత్‌లో జెట్ ఇంజిన్‌లను సంయుక్తంగా తయారు చేసే అగ్రిమెంట్‌లో పురోగతి కనిపించనుంది. MQ-9B సాయుధ డ్రోన్‌ల కొనుగోలు, పౌర అణు బాధ్యత మరియు వాణిజ్య ఒప్పందంపై మోడీ, జో బైడెన్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ ఎజెండాలో ప్రధాన అంశాలు ఇవాళ్టి సమావేశంలో చర్చకు రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

అయితే కొన్ని ఒప్పందాలు జనవరిలో జరుగుతాయని ఇరు దేశాలు భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 26 లేదా ఒకరోజు ముందు ముఖ్య అతిథులుగా ఉన్న నాయకులతో క్వాడ్ లీడర్స్ సమ్మిట్‌ను నిర్వహించాలని భారత్ చూస్తోన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ కింద హై టెక్నాలజీ సహకారంపై ఇరు దేశాధినేతల సమీక్ష జరగనుంది. ఉక్రెయిన్‌లోని పరిస్థితులు, అమెరికా-చైనా సంబంధాలు, భారత్-చైనా సంబంధాలు, వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.

భారత్, యూఎస్ అణు ఒప్పందం మరియు పౌర అణు బాధ్యత ఒప్పందంతో పాటు కొత్త పెట్టుబడులు ప్రకటించే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వరల్డ్ ట్రేడింగ్ సెంటర్‌లో భారత్‌పై కేసులను అమెరికా ఉపసంహరించుకుంది. అయితే కొన్ని అమెరికా వస్తువులపై సుంకాల పెంపుదలను తగ్గించడానికి భారత్ ముందుకొచ్చింది. దీంతో అత్యుత్తమ వాణిజ్య సమస్యలపై ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది. ప్రత్యేకంగా 2022 మే నెలలో ప్రారంభించిన ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫోరమ్‌లో భారత్‌ చేరాలని జో బైడెన్ కోరనున్నట్లు సమాచారం.

Show Full Article
Print Article
Next Story
More Stories