రైలుకు వందనం.. ఫోటో వైరల్!

A Man Bows to Local train in Mumbai
x
ముంబై లోకల్ ట్రైన్ కు నమస్కరిస్తున్న ప్రయాణీకుడు (ట్విట్టర్ ఫోటో)
Highlights

చాలా కాలం తరువాత పట్టాలెక్కిన ముంబయి లోకల్ ట్రైన్ వ్యవస్థ తో ముంబయి వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కరోనా మహమ్మారి సాధారణ ప్రజా వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేసేసింది. లాక్ డౌన్ తో వ్యవస్థలన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయి. చాలా కాలం తరువాత క్రమంగా అన్ని వ్య్వస్తలకూ జీవం వస్తోంది. సినిమా హాళ్ళు.. మాల్స్.. బజార్లు ఇలా ఒక్కొటిగా గాడిలో పడుతున్నాయి. ఇక ప్రజా రవాణా వ్యవస్థలూ అందుబాటులోకి వచ్చాయి. మొదట బస్సులు.. పాక్షికంగా రైళ్ళు.. తరువాత మెట్రో రైళ్ళు ఇలా ఒక్కో ప్రజా రవాణా వ్యవస్థా ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తాజాగా ముంబాయిలో లోకల్ రైళ్ళు తిరిగి పరుగులు తీస్తున్నాయి.

ముంబాయిలో లోకల్ రైళ్ళు తిరిగి ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా ముంబయి వాసుల ఆనందానికి అవధులు లేవు. ముంబాయిలో లోకల్ రైళ్ళలో నిత్యం లక్షలాది మంది ప్రయాణిస్తారు. లోకల్ రైళ్ళ పై ఆధారపడి వేలాదిమంది జీవిస్తారు. కరోనా దెబ్బకు వారంతా దాదాపు పదినెలల కాలంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కున్నారు. ఇప్పుడు మళ్ళీ లోకల్ రైళ్ళు తిరగడం మొదలు పెట్టగానే వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

లోకల్ రైళ్ళు పరుగులు తీయడం ప్రారంభించిన సందర్భంగా ఓ యువకుడు లోకల్ రైలు ఎక్కే ముందు రైలు గేటు వద్ద శిరసు వంచి నమస్కారం చేశాడు. దీనిని ఫోటో తీసిన వారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. ముంబయి వాసులకు లోకల్ ట్రైన్ ఎంత విలువైనదో చెప్పే విధంగా.. సమయానుసారంగా ఈ ఫోటో క్లిక్ చేసిన ఫోటోగ్రాఫర్ కు సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

అంతేకాకుండా.. ముంబయి లోకల్ రైళ్ళు తిరిగి పరుగులు తీస్తున్నందుకు ముంబయి వాసుల ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఇప్పుడు ముంబయి లోకల్ రైళ్ళ పునఃప్రారంభ వీడియోలు.. చిత్రాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories